తమిళంలోకి చైతన్య

  • IndiaGlitz, [Friday,February 17 2017]

ఏం మాయ చేశావే సినిమాతో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే త‌మిళ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో చైతు ఏం మాయ చేశావే, సాహ‌సం శ్వాస‌గా సాగిపో అనే రెండు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు త‌మిళంలో స‌మాంత‌రంగా తెర‌కెక్కాయి.

మ‌రి చైతుతో నెక్ట్స్ సినిమాను తెలుగు, త‌మిళంలో చేస్తాన‌ని గౌత‌మ్ మీన‌న్ చెప్పాడు. అయితే అంత కంటే ముందుగానే నాగ‌చైత‌న్య త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కార్తీక్ న‌రేన్ అనే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్న హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ల్ చిత్రం నాగ‌చైత‌న్య న‌టించ‌బోతున్నాడని కోలీవుడ్ స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ వ‌స్తుంది.

More News

శృతి అతనితో డేటింగ్ చేస్తుంది

కమల్ ముద్దుల తనయ శృతిహాసన్ డేటింగ్ చేస్తుంది. అయితే శృతి బాయ్ ఫ్రెండ్ ఇండియన్ కాడు. లండన్కు చెందిన మైకెల్ కార్స్లే అనే నటుడుతో శృతి చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది. లండన్లోని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి పరిచయం జరిగింది.

రచయితగా మారిన రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

లావణ్య విత్ లవ్ బాయ్స్ ప్రారంభం

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పిల్లజమీందార్, పెద్దరికం, భైరవద్వీపం, సోగ్డాగే చిన్ని నాయనా చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.

ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న మంచు విష్ణు-సురభి!

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

'రోగ్ ' ఫస్ట్ లుక్ కు ట్రెమెండస్ రెస్పాన్స్

బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్ వంటి డిఫరెంట్ క్యారెక్టర్ బేస్డ్ బ్లాక్బస్టర్ చిత్రాలను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్'.