దిల్‌రాజు బ్యాన‌ర్‌లో చైత‌న్య‌..!!

  • IndiaGlitz, [Monday,April 06 2020]

అక్కినేని నాగచైత‌న్య ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరి సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కరోనా వైరస్ తగ్గిన తర్వాత సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తారు. దీని త‌ర్వాత ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు నాగచైతన్య. ఈ సినిమాకు నాగేశ్వ‌ర‌రావు అనే టైటిల్ పెట్టారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా దాదాపు పూర్త‌య్యాయి. అంతా ఓకే అనుకుంటోన్న త‌రుణంలో హీరో మ‌హేశ్ లైన్‌లోకి రావడంతో పరుశురామ్ అతనితో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. దీంతో నాగేశ్వరరావు హోల్డ్‌లో పడింది.

అయితే నాగచైతన్య తమకు కేటాయించిన డేట్స్‌ను 14 రీల్స్ ప్ల‌స్ వేస్ట్ చేయ‌ద‌లుచుకోలేదు. ఆ డేట్స్‌కు దిల్‌రాజుకు కేటాయించింద‌ట‌. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డానికి నాగ‌చైత‌న్య కూడా ఆస‌క్తి కూడా ఉన్నాడ‌ట‌. రైట‌ర్, డైరెక్ట‌ర్ బీవీఎస్ ర‌వి రాసిన ఓ క‌థ‌ను విన్న నాగ‌చైత‌న్య సినిమా చేయ‌డానికి ఓకే చెప్పేశాడ‌ట‌. ఈ చిత్రాన్ని విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని టాక్‌. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు ఆగి ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తి వేయ‌గానే ఈ సినిమా ముందుకు క‌దులుతుంద‌ని స‌మాచారం.

More News

అన్న‌య్య స్థానాన్ని త‌మ్ముడు భ‌ర్తీ చేస్తాడా?

అన్నీ అనుకున్న‌ట్లు సాగుంటే మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. అయితే క‌రోనా వైర‌స్

నానితో పాటు విల‌నిజం చూపించనున్న హీరోయిన్

హైద‌రాబాద్‌కు చెందిన అదితిరావు హైద‌రి బాలీవుడ్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న త‌ర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ఈ అమ్మ‌డు ఆస‌క్తిని చూపుతుంది.

‘అల వైకుంఠ‌పుములో’ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తున్నారో తెలుసా?

ఈ ఏడాది తెలుగు సినిమాకు మంచి ప్రారంభ‌మే ద‌క్కింది. రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. అందులో అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో

ఇండియాలో లాక్‌డౌన్ తప్పనిసరి : కేసీఆర్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో యావత్ ఇండియా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం విదితమే. ఏప్రిల్-14 వరకూ ఈ లాక్‌డౌన్ ఉండనుంది.

ఇవి తింటే.. కరోనాపై పోరాడొచ్చు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని దేశాలు పోరాడుతున్నాయి. ఇంతవరకూ ఈ వైరస్‌ను చంపేందుకు ఎలాంటి మందు కనుగొనలేకపోయారు.