మైత్రీ మూవీస్ లో చైతు...

  • IndiaGlitz, [Tuesday,May 02 2017]

ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రారండోయ్ వేడుక‌చూద్దాం, కృష్ణ అనే నూత‌న ద‌ర్శ‌కుడితో ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్న అక్కినేని నాగ‌చైత‌న్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

అల్రెడి చైత‌న్య‌తో ప్రేమమ్ వంటి ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కించి హిట్ అందించిన చందు మొండేటి అల్రెడి చైతు కోసం ఓ మంచి లైన్‌ను సిద్ధం చేసుకున్నాడ‌ట‌. చైతు కూడా సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళ్ళ‌నున్న ఈ సినిమాను శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంద‌ట‌.

ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ సుకుమార్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

More News

కాజల్ క్లారిఫికేషన్....

బాలీవుడ్ నటి కాజల్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. స్టార్ హీరో అజయ్దేవగన్ ను పెళ్ళి చేసుకున్న కాజల్ ఇప్పుడు తమిళ సినిమా విఐపి 2 చిత్రంలో నటిస్తుంది.

500 కోట్ల 'బాహుబలి-2'

తెలుగు సినిమా అంటే సరికొత్త అర్థం చెబుతూ బాహుబలి రెండో పార్ట్ 'బాహుబలి -2' బాక్సాఫీస్ వద్ద స్టామినాను చాటుతుంది. కొత్త కొత్త రికార్డులను తెర తీస్తుంది.

కళాతపస్వికి అరుదైన గౌరవం...

కళాతపస్వి కె.విశ్వనాథ్, మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డు స్వీకరించిన అనంతం వేదికపై కె.విశ్వనాథ్ ప్రసంగించనున్నారు.

స్సెషల్ సాంగ్ లో శ్రియ...

మూడు పదులు వయసు దాటినా నటి శ్రియ మాత్రం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం శ్రియ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నక్షత్రం' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించనుంది.

తిరుమలలో ఎన్టీఆర్...

`జై లవకుశ` చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ కాస్తా విరామంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. సతీమణి లక్ష్మీప్రణితితో కలిసి మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు.