close
Choose your channels

'మ‌జిలీ' చిత్రీక‌ర‌ణ పూర్తి.. చైత‌న్య ఎమోష‌న‌ల్ ట్వీట్‌

Friday, February 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌జిలీ చిత్రీక‌ర‌ణ పూర్తి.. చైత‌న్య ఎమోష‌న‌ల్ ట్వీట్‌

పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం 'మజిలీ'. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది. ప్రేమ‌, పెళ్లి అనే అంశాలే ప్ర‌ధానంగా ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మింది. ప్రేమికుల రోజున విడుద‌లైన టీజ‌ర్‌కు కూడా చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుద‌ల చేయ‌బోతున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని చైత‌న్య ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. `షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌లో ప‌నిచేయ‌డం బెస్ట్ మూమెంట్స్‌గా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఓ మంచి క‌థ‌ను మా ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన శివ నిర్వాణకి థాంక్స్‌. అలాగే మీ టీంతో క‌లిసి ఇలాంటి స్టోరీస్ మ‌రిన్ని చెప్పాల‌నుకుంటున్నాను`` అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు చైత‌న్య‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.