close
Choose your channels

మైనస్ 4 డిగ్రీల చ‌లిలో 'వెంకీమామ‌' కోసం చైతు ప‌డ్డ క‌ష్టం

Monday, December 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మైనస్ 4 డిగ్రీల చ‌లిలో `వెంకీమామ‌` కోసం చైతు ప‌డ్డ క‌ష్టం

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ‌`. ఈ సినిమా కోసం ఈ ఇద్ద‌రు స్టార్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో వెంక‌టేశ్‌, చైత‌న్య‌ల‌కు ఉన్న ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ ..ప్ర‌మోష‌న్స్‌లో వారి సంభాష‌ణ‌ల్లో అర్థ‌మైంది.

నాగ‌చైత‌న్య ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఆయ‌నపై కాశ్మీర్‌లో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. సోనామార్గ్‌లో మైన‌స్ నాలుగైదు డిగ్రీల చ‌లిలో యూనిట్ చైత‌న్య‌పై ఉన్న స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించింది. ఈ షూటింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలంటే కేవ‌లం గుర్రాల‌పైనే వెళ్లాల్సి ఉంటుంది. అలా యూనిట్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ ప్రాంతంలో స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అలాగే పాలెగావ్‌, గుల్మార్గ్ ప్రాంతాల్లోనూ కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఈ సినిమాలో 40 నిమిషాలు చాలా కీల‌కంగా ఉంటుంది. విజువ‌ల్స్‌, ప్రెజంటేష‌న్‌, ఇత‌ర సాంకేతిక అంశాలు సినిమాలో హైలైట్ కానున్నాయి. డిసెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రాన్ని కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.