Lal Singh Chadda: 'లాల్ సింగ్ చెడ్డా' నుంచి నాగ చైతన్య లుక్ విడుదల

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం గమనార్హం. ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈయన ఫస్ట్ లుక్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.

ఇందులో బాలరాజు పాత్రలో నటిస్తున్నారు చైతన్య. అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు అక్కినేని హీరో. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చూశారు. షో అయిపోయిన తర్వాత అమీర్ ఖాన్ పెర్ఫార్మన్స్ గురించి.. చైతన్య పాత్ర గురించి బాగా ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్. సినిమా ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుందని.. తెలుగులో కూడా ప్రేక్షకుల మన్ననులు అందుకుంటున్న అని తెలిపారు చిరంజీవి. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

న‌టీన‌టులు - ఆమిర్ ఖాన్, క‌రీనా కుమార్, నాగ చైత‌న్య త‌దిత‌రులు స‌మ‌ర్ప‌ణ - మెగాస్టార్ చిరంజీవి బ్యాన‌ర్లు - వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాత‌లు - ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే సంగీతం - ప్రీతిమ్ భార‌తీయ చిత్రానుక‌ర‌ణ - అతుల్ కుల్ క‌ర్ణి ద‌ర్శ‌క‌త్వం - అద్వైత్ చంద‌న్

More News

Janasena : జగన్‌వి గొప్పలే.. 10 శాతం కూడా భూసేకరణ కాలేదు : రామాయపట్నం పోర్ట్ నిర్మాణంపై నాదెండ్ల వ్యాఖ్యలు

రామాయపట్నం పోర్టు నిర్మాణంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.

Janasena : సీక్రెట్‌గా ఆ డీల్, రామాయపట్నంపై ఎన్నో అనుమానాలు.. జగన్ సమాధానం చెప్పాల్సిందే: నాదెండ్ల

కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఉన్న ఎమ్.ఓ.యు.ని ముఖ్యమంత్రి ఎందుకు గోప్యంగా ఉంచారని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.

Parampara Season 2: 'పరంపర' సీజన్ 2ను ఎంజాయ్ చేస్తున్నారు - శరత్ కుమార్

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్,

Janasena : సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్.. కొందరిపై ఎందుకీ వివక్ష : నాదెండ్ల మనోహర్

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ప్రకటనలో రాష్ట్రప్రభుత్వం కొంతమంది ఉద్యోగుల పట్ల వివక్ష వైఖరి కనబరుస్తోందని ఆరోపించారు

Janasena : గుడివాడలో ఒక్క రోడ్డయినా బాగుందా.. హైదరాబాద్‌లో పనేంటీ : కొడాలి నానిపై జనసేన నేత శ్రీకాంత్ ఆగ్రహం

janasena leader srikanth slams ex minister kodali nani over roads conditions in gudivada