నానితో నాగశౌర్య హీరోయిన్....
Thursday, September 6, 2018 తెలుగు Comments
ఈ నెల 27న `దేవదాస్` చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి వస్తున్న నేచురల్ స్టార్ నాని తదుపరిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో `జెర్సీ` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ ఫోకస్‌తో నాని జెర్సీ షురూ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. రెబ్బా మోనిన పేరు పరిశీలనలో వచ్చింది. తాజాగా కశ్మీరా పరదేశిని తీసుకోవాలనుకుంటున్నారట. రీసెంట్‌గా విడుదలైన `@నర్తనశాల` చిత్రంలో నాగశౌర్య జతగా నటించిన కశ్మీరా పరదేశి నానితో నటించనుండటం మంచి అవకాశంగా చెప్పవచ్చు.