close
Choose your channels

నాగశౌర్య కొత్త చిత్రం

Thursday, September 19, 2019 • తెలుగు Comments

నాగశౌర్య కొత్త చిత్రం

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌నుంది. ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ప్రొడనెం.నెం.8 మూవీలో హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలియ‌జేశారు. అక్టోబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సినిమాను వ‌చ్చే ఏడాది మే నెల‌లో విడుద‌ల చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

గ‌త ఏడాది నాగ‌శౌర్య‌కు పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే అటు న‌టుడిగా, ఇటు నిర్మాత‌గా నాగ‌శౌర్య‌కు హిట్ లేదు. ప్రారంభం కావాల్సిన ఒక‌ట్రెండు చిత్రాలు కూడా ఆగిపోయాయి. అలాంటి త‌రుణంలో స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన `ఓబేబీ` చిత్రంలో నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈయ‌న హీరోగా మ‌రో సినిమా ఏదీ విడుద‌ల కాలేదు. అయితే త‌న బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు అలాగే ఇప్పుడు కొత్త సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రి శౌర్య స్వంత సినిమా ఈ ఏడాది అయినా విడుద‌ల‌వుతుందో లేదో తెలియ‌దు. మ‌రి ఈ ఏడాది అయినా నాగ‌శౌర్య హిట్ కొట్టాల‌నే తాప‌త్ర‌యంతో ఉన్నాడ‌ట‌. మ‌రి త‌న‌కు హిట్ రావాల‌ని కోరుకుందాం.

Get Breaking News Alerts From IndiaGlitz