నాగశౌర్య కొత్త చిత్రం

  • IndiaGlitz, [Thursday,September 19 2019]

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించ‌నుంది. ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ప్రొడనెం.నెం.8 మూవీలో హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలియ‌జేశారు. అక్టోబ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే సినిమాను వ‌చ్చే ఏడాది మే నెల‌లో విడుద‌ల చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

గ‌త ఏడాది నాగ‌శౌర్య‌కు పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే అటు న‌టుడిగా, ఇటు నిర్మాత‌గా నాగ‌శౌర్య‌కు హిట్ లేదు. ప్రారంభం కావాల్సిన ఒక‌ట్రెండు చిత్రాలు కూడా ఆగిపోయాయి. అలాంటి త‌రుణంలో స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన 'ఓబేబీ' చిత్రంలో నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈయ‌న హీరోగా మ‌రో సినిమా ఏదీ విడుద‌ల కాలేదు. అయితే త‌న బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు అలాగే ఇప్పుడు కొత్త సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రి శౌర్య స్వంత సినిమా ఈ ఏడాది అయినా విడుద‌ల‌వుతుందో లేదో తెలియ‌దు. మ‌రి ఈ ఏడాది అయినా నాగ‌శౌర్య హిట్ కొట్టాల‌నే తాప‌త్ర‌యంతో ఉన్నాడ‌ట‌. మ‌రి త‌న‌కు హిట్ రావాల‌ని కోరుకుందాం.

More News

రైతు పాత్ర‌లో వినాయ‌క్‌

రెడీ.. యాక్ష‌న్‌.. క‌ట్ అంటూ స్టార్ హీరోల‌ను డైరెక్ట్ చేసి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించుకున్నారు వి.వి.వినాయ‌క్‌. అయితే త‌ర్వ‌లోనే ఈయ‌న రెడీ..యాక్ష‌న్‌.. క‌ట్ చెప్పించుకోనున్నారు.

డేటింగ్‌లో ప‌వ‌న్ హీరో్యిన్‌

వ‌య్యారాలా జాబిల్లి ఓణీ క‌ట్టి అంటూ ప‌వ‌న్‌ను తీన్‌మార్‌లో ఆక‌ట్టుకున్న సొగ‌స‌రి కృతి క‌ర్బందా. ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ ప‌వ‌న్‌తో `తీన్‌మార్‌` సినిమా చేయ‌క ముందు కృతి క‌ర్బందా కొన్ని తెలుగు

మోదీతో దీదీ భేటీ.. పేరు మారుతుందా!?

భారత ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలియాస్ దీదీ కలిశారు. బుధవారం సాయంత్రం ప్రధాని నివాసానికి వెళ్లిన దీదీ.. మోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట...

‘సైరా’ ట్రైలర్: ‘నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా యుద్ధమే’

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్.. కెరియర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ ఈ బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీని

రాజ‌మండ్రిలో 'ఇండియ‌న్ 2'

లంచ‌గొండి అధికారుల భ‌ర‌తం ప‌ట్టిన సేనాప‌తి వెండితెర‌పై సంద‌డి చేసి 23 ఏళ్లు అవుతుంది. `ఇండియ‌న్(భారతీయుడు)`గా 1996లో వెండితెర‌పై సేనాప‌తి చేసిన సంద‌డి గుర్తుండే ఉంటుంది.