ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌తో హిట్ కొడ‌తాడా...

  • IndiaGlitz, [Friday,November 27 2015]

'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' చిత్రాల‌తో విష‌యం ఉన్న యువ క‌థానాయ‌కుడుగా పేరు తెచ్చుకున్నాడు నాగ‌శౌర్య‌. ఆ చిత్రాల త‌రువాత చేసిన సినిమాలేవీ అత‌న్ని ఆదుకోలేక‌పోయాయి. ఈ నేప‌థ్యంలో రానున్న త‌న రెండు కొత్త చిత్రాల‌పై బోల్డ‌న్ని ఆశ‌ల‌ను పెట్టుకున్నాడు శౌర్య‌.

ఆ సినిమాలే 'అబ్బాయితో అమ్మాయి', 'క‌ళ్యాణ వైభోగ‌మే'. విశేష‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల‌ను ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కులే తెర‌కెక్కించ‌డం. 'అబ్బాయితో అమ్మాయి'ని 'వీర' వంటి డిజాస్ట‌ర్‌ త‌రువాత ర‌మేష్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తుంటే.. 'క‌ళ్యాణ వైభోగ‌మే'ని 'జ‌బ‌ర్‌ద‌స్త్' వంటి డిజాస్ట‌ర్ త‌రువాత 'అలా మొద‌లైంది' ఫేమ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. డిసెంబ‌ర్‌లోనే రానున్న ఈ ఫ్లాప్ డైరెక్ట‌ర్‌ల రెండు సినిమాలు.. ఫ్లాప్స్‌తో స‌త‌మ‌త‌మవుతున్న నాగ‌శౌర్య‌కి ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌తాయో చూడాలి.

More News

భారీ ప్రాజెక్ట్‌ల‌తో హరీష్ మ‌ళ్లీ బిజీ

హేరిస్ జైరాజ్‌.. మూడేళ్ల కింద‌టి వ‌ర‌కు ఈ పేరు త‌మిళ‌, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో సంచ‌ల‌నం. క్వాలిటీ వ‌ర్క్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే సంగీత ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న హేరిస్‌.

మళ్లీ వాయిదావేసిన సూర్య

ఏదైనా సినిమా ఓ సారి వాయిదా పడిందంటే..మళ్లీ మళ్లీ అదే బాట పడుతుంది.

'తను నేను' మూవీ రివ్యూ

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా చిత్రాలు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్నిర్మించిన పి.రామ్మోహన్ అష్టాచమ్మాతో నాని, ఉయ్యాలా జంపాలాతో రాజ్ తరుణ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

'సైజ్ జీరో' మూవీ రివ్యూ

ఇప్పుడు యూత్ అందరూ ఎక్సర్సైజ్ లు చేసి బాడీలు పెంచుతుంటారు. కానీ ఈ ఫిట్నెస్ లపై ఆధారపడి కొన్ని సెంటర్స్వారు కొద్దిరోజుల్లోనే సన్నబడిపోతారు అంటుంటారు. అలాగే మనకు కనపడే అమ్మాయిల్లో లావుగా ఉండి పెళ్ళి కానీ అమ్మాయిలుంటారు.

నిత్యా మీనన్ హీరోయిన్ కాదట

పాత్ర నచ్చితే చాలు..నిడివితో సంబంధం లేకుండా సినిమా చేసేస్తుంటుంది నిత్యా మీనన్.నిన్నటికి నిన్న 'సన్నాఫ్ సత్య మూర్తి''లో హీరోయిన్ కి తక్కువ..