నాగ‌శౌర్య‌కి ఈ సారైనా..

  • IndiaGlitz, [Monday,November 02 2015]

జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. 'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' చిత్రాల‌తో న‌టుడిగా స‌త్తా చాటుకున్న శౌర్య‌.. 'ల‌క్ష్మీ రావే మా ఇంటికి', 'జాదుగాడు'ల‌తో తుస్సుమ‌నిపించాడు. ఈ నేప‌థ్యంలో కొత్త చిత్రాల విష‌యంలో బాగానే ఫోక‌స్ పెట్టాడ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

అలా ఫోక‌స్ పెట్టిన సినిమాల‌లో ఒక‌టైన 'అబ్బాయితో అమ్మాయి' డిసెంబ‌ర్ మొద‌టి వారంలో రిలీజ్ కానుంది. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత‌మందించారు. గ‌తేడాది డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో వ‌చ్చిన 'ల‌క్ష్మీ రావే మా ఇంటికి' నాగ‌శౌర్య‌ని నిరాశ‌ప‌రిచింది. అదే టైంలో మ‌రోసారి వ‌స్తున్న అత‌నికి ఈ సారైనా విజ‌యం వ‌రిస్తుందేమో చూడాలి.

More News

కేర‌ళ‌లో శంక‌రాభ‌ర‌ణం

నిఖిల్, నందిత జంట‌గా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బాల‌కృష్ణతో అక్ష కామెడీ చేస్తోందా?

'కందిరీగ' సినిమాలో తెలంగాణ పోరిగా అక్ష చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. మ‌ళ్లీ ఆ స్థాయి పాత్ర అక్ష‌ని వ‌రించ‌నేలేదు.

నాడు 'ఢ‌మ‌రుకం'.. నేడు 'అఖిల్‌'..

నాగార్జున‌, అనుష్క జంట‌గా న‌టించిన 'ఢ‌మ‌రుకం' సినిమా గుర్తుందిగా.. మూడేళ్ల క్రితం విడుద‌లైన ఈ సోషియో ఫాంట‌సీ.. బాక్సాఫీస్ వ‌ద్ద మిశ్ర‌మ ఫ‌లితం పొందింది.

సంప‌త్ నంది.. న‌వంబ‌ర్ సెంటిమెంట్‌

5 ఏళ్లు.. 3 సినిమాలు.. ఇదీ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌ప్ర‌స్థానం. 'ఏమైందీ వేళ‌', 'ర‌చ్చ' వంటి విజ‌యవంత‌మైన సినిమాల త‌రువాత సంప‌త్ రూపొందించిన చిత్రం 'బెంగాల్ టైగ‌ర్‌'.

అజిత్ తెలుగు టైటిల్ ఫిక్సయింది...

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్,శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న తమిళ చిత్రం ‘వేదాళం’.ఈ చిత్రాన్ని తెలుగులో ‘అవేశం’అనే పేరుతో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.