Krishna Vrinda Vihari: నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి' 'తార నా తార' పాట విడుదల

  • IndiaGlitz, [Tuesday,September 06 2022]

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

కృష్ణ వ్రింద విహారి లోని తార నా తార పాట‌ విడుద‌ల అయింది. నాగ శౌర్య , షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీ ని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు మహతి. లీడ్ పెయిర్ బైక్ రైడ్‌ కివెళ్ళడం, షిర్లీ కౌగలించుకున్నపుడు శౌర్య మదురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా వుంది. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం యూత్‌ఫుల్‌ గా ఉంది. నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్ గా పాడారు. అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు

More News

Ahimsa: 'అహింస' షూటింగ్ పూర్తి

స్టార్స్‌తో పాటు నూతన నటీనటులతో బ్లాక్‌బస్టర్‌లను అందించగల సామర్థ్యం దర్శకుడు తేజ సొంతం.

Delhi Liquor Scam : దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో ఈడీ దాడులు... హైదరాబాద్‌లోనూ తనిఖీలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది.

Demat Accounts : స్టాక్ మార్కెట్లలో మదుపుపై మక్కువ.. 10 కోట్లు దాటిన డీమ్యాట్ ఖతాల సంఖ్య

మారుతున్న కాలమాన పరిస్ధితులకు తగ్గట్టుగానే దేశంలో పొదుపు అలవాట్లలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Teachers Day : ఈ కబోది ప్రభుత్వానికి కళ్లు తెరిపించండి .. అండగా వుంటా : ఉపాధ్యాయులకు పవన్ పిలుపు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువులకు శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Like Share and Subscribe: 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' ఫస్ట్ లుక్ విడుదల

వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు