శౌర్య కొత్త సినిమా 'గ‌ణ‌'

  • IndiaGlitz, [Tuesday,August 21 2018]

ఒక సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గానే మ‌రో సినిమాను ప‌ట్టాల‌మీద‌కు ఎక్కించి బిజీ అవుతున్నాడు హీరో నాగ‌శౌర్య‌. తాజాగా ఆయ‌న న‌టించిన @న‌ర్త‌న‌శాల ఇంకా విడుద‌ల కాలేదు. అప్పుడే ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు శౌర్య‌. ఆ సినిమాకు గ‌ణ అనే పేరు పెట్టారు. సినిమాలో హీరో పేరు గ‌ణ‌ప‌తి. దాన్ని బేస్ చేసుకుని గ‌ణ అని పేరు పెట్టారు.

శేఖ‌ర్ క‌మ్ముల దగ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసిన తేజ అనే వ్య‌క్తి చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు శౌర్య‌. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఐరా క్రియేష‌న్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాను కూడా సొంత నిర్మాణ సంస్థ‌లోనే తెర‌కెక్కించాల‌న్న‌ది శౌర్య సంక‌ల్పం. త‌న సొంత సంస్థ ఐరాలో ఇప్ప‌టికే చ‌లో హిట్ అందుకున్నాడు శౌర్య‌.

రెండో సినిమా న‌ర్త‌న‌శాల కూడా అదే బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే పాజిటివ్ బ‌జ్‌ని కూడా తెచ్చుకుంది. సో మూడో సినిమాను కూడా సొంత సంస్థ‌లోనే తెర‌కెక్కించ‌డానికి ఉత్సాహ‌ప‌డుతున్నాడు శౌర్య‌.

More News

ధ‌న్య మ‌ల‌యాళం ఎంట్రీ

ధ‌న్య బాల‌కృష్ణ‌న్ పేరు విన‌గానే మ‌న‌కు సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, ర‌న్ రాజా ర‌న్‌, నేనూ శైల‌జ వంటి ప‌లు సినిమాలు గుర్తుకొస్తాయి.

చైతు సినిమా పోస్ట్ పోన్ అవుతుందా?

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా రూపొందుతోన్న చిత్రం 'శైల‌జారెడ్డి అల్లుడు'. 'మ‌హానుభావుడు' వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ అత్త పాత్ర‌లో న‌టిస్తుండ‌గా...

50 కోట్ల క్ల‌బ్‌లో 'గీత గోవిందం'

ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన 'గీత గోవిందం' బాక్సాఫీస్ సంచ‌నాల‌కు కేంద్ర‌మైంది. అర్జున్‌రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం కావ‌డంతో.. తొలి రోజున యూత్ థియేట‌ర్స్‌కు వ‌చ్చారు.

ర‌జనీకాంత్‌తో డ‌స్కీ బ్యూటీ

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సిన‌మా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ మాయ పేరేమిటో చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది - కోన వెంక‌ట్‌

వి.ఎస్‌.వ‌ వర్క్స్  బేనర్‌పై  సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'.