నాగ‌శౌర్య నూత‌న చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,June 23 2018]

విభిన్నమైన చిత్రాల‌ను నిర్మించే సంస్థ‌గా తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో భ‌వ్య క్రియేష‌న్స్ కు మంచి పేరు ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 'పైసా వ‌సూల్‌' త‌ర్వాత ఈ సంస్థ తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది. 'ఛ‌లో' సినిమాతో గ్రాండ్ స‌క్సెస్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది. కొత్త ద‌ర్శ‌కుడు రాజా కొలుసును ప‌రిచ‌యం చేస్తూ భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద ప్ర‌సాద్ నిర్మిస్తున్న తొమ్మిదో చిత్ర‌మిది.

హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు శ‌నివారం ఉద‌యం లాంఛ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత ఆనంద‌ప్ర‌సాద్ స‌తీమ‌ణి కృష్ణ కుమారి, హీరో నాగ‌శౌర్య త‌ల్లి దండ్రులు ఉషా బాల‌, శంక‌ర‌ప్ర‌సాద్ తదితరులు పాల్గొన్నారు. ఆగ‌స్టు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: సాయి శ్రీరామ్‌, సంగీతం: మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌, ఆర్ట్: వివేక్‌, ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: రాజా కొలుసు.

More News

'నీర్వాణ సినిమాస్' ప్రొడక్షన్ నెం.1 'రాహుల్ విజయ్ , నీహారిక కొణిదెల చిత్రం ప్రారంభం

హీరో రాహుల్ విజయ్, మెగా హీరోయిన్ నీహారిక హీరో హీరోయిన్ గా తెరకెక్కబోతున్న రొమాంటిక్ కామెడి సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

'గీతగోవిందం' మెద‌టి లుక్‌

అర్జున్ రెడ్డి చిత్రం లో స్టార్‌డ‌మ్ ని సంపాయించట‌మే కాకుండా కొట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర కొండ హ‌రోగా,

వెంక‌టేశ్, వ‌రుణ్‌తేజ్‌ల 'ఎఫ్‌2' ప్రారంభం

వైవిధ్య‌భ‌రిత‌మైన సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని చూపే అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్‌తో 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు' వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత‌.... మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ తో 'ఫిదా'

విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్‌...

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్ళి చూపులు చిత్రాలతో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

సెన్సేష‌న‌ల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తోన్నవిజ‌యేంద్ర ప్ర‌సాద్..

అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ ర‌చ‌యిత‌గానే ఉన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్ బాహుబ‌లి, బ‌జ‌రంగీ భాయ్‌జాన్ చిత్రాల‌తో స్టార్ రైటర్‌గా ప్యాన్ ఇండియాలో పేరు సంపాదించుకున్నారు.