నాగ‌శౌర్య‌.. ముగ్గురు కొత్త ద‌ర్శ‌కులు

  • IndiaGlitz, [Thursday,November 02 2017]

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌ శౌర్య‌. ఆ త‌రువాత జో అచ్యుతానంద‌లాంటి చిత్రాల‌తో త‌న ఉనికిని చాటుకున్న ఈ యంగ్ హీరో.. ప్ర‌స్తుతం చేతిలో ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒక‌టి ద్విభాషా చిత్రం. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌కుడిగా రూపొందుతున్న క‌ణం తెలుగు, త‌మిళ భాష‌ల్లో త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

ఫిదా ఫేమ్ సాయిప‌ల్లవి ఇందులో నాలుగేళ్ల పాప‌కి త‌ల్లిగా క‌నిపించ‌నుంది. అలాగే శౌర్య న‌టించిన ఛ‌లో చిత్రం కూడా విడుద‌ల‌కి సిద్ధ‌మవుతోంది. ఇదిలా ఉంటే.. ముగ్గురు కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డానికి నాగ‌శౌర్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

కృష్ణ‌వంశీ శిష్యుడు శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న న‌ర్త‌న శాల‌.. సుంద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న అమ్మ‌మ్మ‌గారి ఇల్లుతో పాటు ఛాయాగ్రాహ‌కుడు సాయి శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న తొలి చిత్రంలోనూ న‌టించేందుకు నాగ‌శౌర్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లే ఈ మూడు సినిమాలు.. వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది.

More News

రాజ‌శేఖ‌ర్ ఇంట మ‌రో విషాదం...

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌కు మ‌రో విషాద ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్ అమ్మ‌గారు గుండె పోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ బాధ‌ను మ‌ర‌చిపోక‌పోకముందే,  రాజశేఖ‌ర్ బావ మ‌రిది, జీవిత సోద‌రుడు ..ముర‌ళీ శ్రీనివాస్ అనారోగ్యంతో క‌న్నుమూశారు.

అన్న‌ పై ప‌వ‌న్ ప్రేమ‌...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి అంటే త‌న‌కు అభిమాన‌మో మ‌రోసారి చేత‌ల‌తో చాటుకున్నారు. ప‌వ‌న్‌కు అక్టోబ‌ర్ నెల‌లో కొడుకు పుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కొడుక్కి ప‌వ‌న్ మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ అనే పేరును పెట్టారు.

నటుడిగా మారుతున్న ర‌సూల్ పూకుట్టి....

2009లో విడుద‌లైన స్ల‌మ్ డామ్ మిలియ‌నీర్ భార‌తీయుల‌కు మ‌ర‌చిపోలేని జ్ఞాపకం. ఎందుకంటే ఆ సినిమాకు పనిచేసిన ఇద్ద‌రు టెక్నిషియ‌న్స్‌కు ఆస్కార్ అవార్డులు వ‌చ్చాయి. అందులో ఒక‌రు ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాగా..మ‌రొక‌రు, ర‌సూల్ పూకుట్టి.

ఓ సినిమా మార్కెట్‌ను ఎవ‌రూ డిసైడ్ చేయ‌లేరు - ప్ర‌వీణ్ స‌త్తారు

డా.రాజశేఖర్ హీరోగా పవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'. ఈ చిత్రంలో రాజశేఖర్ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్‌గా కనిపిస్తారు.

నాగ్‌ జోడిగా మ‌రోసారి...

బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ట‌బుకి టాలీవుడ్ కింగ్ నాగార్జున‌తో మంచి అనుబంధ‌మే ఉంది. వీరిద్ద‌రి జోడికి ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆద‌ర‌ణ కూడా ల‌భించింది.