close
Choose your channels

పవన్ తాజా లుక్‌పై నాగబాబు రియాక్షన్.. క్లారిటీ!

Friday, June 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ తాజా లుక్‌పై నాగబాబు రియాక్షన్.. క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన అట్టర్ ప్లాప్ కాగా.. వైసీపీ విజయకేతనం ఎగరేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు కాదు కదా.. కనీసం తాను పోటీచేసిన రెండు చోట్లా ఘోరంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోవడంతో ఇక ఆయన బ్యాక్ టు సినిమాలే అని పెద్ద ఎత్తున చర్చజరిగింది. దీనిపై స్పందించిన పవన్ తాను బతికున్నంతవరకు రాజకీయాల్లోనే ఉంటానని.. సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే తాజాగా.. పవన్‌ సరికొత్త లుక్‌లో కనిపించగా.. ఆయన మనసు మార్చుకుని మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారని పుకార్లు మొదలయ్యాయి.

అన్న క్లారిటీ ఇచ్చేశాడు..!

అయితే ఈ వ్యవహారంపై లైవ్‌ స్ట్రీమ్‌ ద్వారా స్పందించిన నాగబాబు క్లారిటీ ఇచ్చేశారు." నాకు తెలిసి కల్యాణ్ బాబు ఓసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోడు. కల్యాణ్ బాబు ఓ సారి సినిమాలు చేయను అని చెప్పిన తర్వాత మళ్లీ అందులోకి రారు. మా అన్నయ్య చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నాడు కాబట్టే మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కల్యాణ్ బాబు అలా కాదు.. సినిమాలు వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్లారు. ఓ వైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు" అని నాగబాబు చెప్పుకొచ్చారు.

హీరో కాదు.. అతిథి మాత్రమే..!

అంతటితో ఆగని నాగబాబు.. మరో చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. భవిష్యత్తులో ఎవరైనా.. ఏదైనా సినిమాలో అతిథి పాత్ర చేయమంటే మాత్రం కచ్చితంగా పవన్ చేసే అవకాశాలున్నాయని.. హీరోగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తమ్ముడు చేయడని నాగబాబు బల్లగుద్ధి చెబుతున్నారు. సో.. ఇంతటితో పవన్ కల్యాణ్ సినీ కెరియర్ ముగిసిందనే చెప్పుకోవాలి. ఇక ఫుల్‌టైమ్ పొలిటిషియన్‌గా పవన్ కల్యాణ్ ఏమేరకు రాణిస్తారో..? సినిమాలను వదలడం అంత సులభమా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.