ప్రకాశ్‌రాజ్ పై మండిపడిన నాగబాబు

  • IndiaGlitz, [Saturday,November 28 2020]

గ్రేట‌ర్ ఎన్నిక‌లలో పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న పోరు కాస్త ఇప్పుడు యాక్ట‌ర్స్ మ‌ధ్య‌‌కు మారింది. రీసెంట్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఉద్దేశించి న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. బీజేపీకి ప‌వ‌న్ స‌పోర్ట్ చేయ‌డంపై స్పందించిన ప్ర‌కాశ్‌రాజ్ ప‌వ‌న్ ఓ ఊస‌ర‌వెళ్లి అని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ సోద‌రుడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఘాటు స‌మాధానం ఇచ్చారు. ‘‘రాజీయాల్లో నిర్ణయాలు మారుతుంటాయి. ఆ నిర్ణ‌యాల వెనుక ఉద్దేశాలు దీర్ఘ‌కాలంలో ప్ర‌జ‌ల‌కు, పార్టీకి ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉంటాయి. మా నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌రగ‌నున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీకి స‌పోర్ట్ చేయ‌డం విస్తృత ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని నా న‌మ్మ‌కం. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రికి ద్రోహం చేశాడ‌ని ప్ర‌తి ప‌నికి మాలిన‌వాడు విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ప్ర‌కాశ్‌రాజ్‌.. నీ డొల్ల‌త‌న‌మేంటో బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి డిబేట్‌లో అర్థ‌మైంది. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి తొక్కిప‌ట్టి నార‌తీస్తుంటే మాట్లాడ‌లేక త‌డ‌బ‌డ‌టం నాకింకా గుర్తుంది.

బీజేపీ తీసుకునే నిర్ణయాలు నీకు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీ గాని, మరే పార్టీ గాని మంచి చేస్తే హర్షించగలగాలి. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ, జనసేన కూటమి శక్తిని ఆపలేరు. నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్‌ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. ఆ తర్వాత మాట్లాడు. డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతలను కాల్చుకు తినే నీకు ఇంత కంటే మంచిగా మాట్లాడడం ఏమి తెలుసు. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటల అన్నా వాళ్లు నిన్ను ఏమీ అనడం లేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. మీడియా అడిగింది క‌దాని, ఒళ్లు పొంగి నీ ప‌నికిమాలిన రాజ‌కీయ డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట వేసుకోకు’’ అన్నారు.

మరి తనపై నాగబాబు చేసిన పరుష వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ ఏమైనా స్పందిస్తాడా? లేక సైలెంట్‌గా ఉండిపోతాడా? అని చూడాలి.

More News

పవన్ కల్యాణ్ ఒక ఊసరవెల్లి: ప్రకాష్ రాజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఆయనను ఊసరవెల్లితో పోలిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీఎం పర్యటనకు సీఎం కేసీఆర్‌కు అనుమతి లేదట...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు.

రేస్ టు ఫినాలే స్టార్ట్..

‘ఓ బేబీ’ టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. మోనాల్ యోగాసనం వేసింది. నేనూ చేస్తా.. నాకేమైనా తక్కువా అని అవినాష్ వచ్చాడు.

ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది: జేపీ నడ్డా

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.