'జార్జ్‌రెడ్డి'.. పవన్, వరుణ్‌తో తీద్దామనుకున్నా కానీ...!

  • IndiaGlitz, [Tuesday,November 12 2019]

తెలుగులో వరస పెట్టి బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బయోపిక్‌లకే ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది కూడా. ఇప్పటికే పలు బయోపిక్‌లు వచ్చి వెళ్లిపోగా.. మరికొన్ని బాక్సాఫీస్‌ను షేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే.. తాజాగా మరో బయోపిక్ తెలుగులో వస్తోంది. స్టూడెంట్ పాలిటిక్స్ గురించి తెలిసిన వారందరికీ జార్జిరెడ్డి పేరు తెలుసు. ఉస్మానియాలో ఒకప్పుడు జార్జి రెడ్డి ఒక సంచలనం. ఆయన జీవితం స్ఫూర్తితోనే గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం.. తన యువ సినిమాలో సూర్య పాత్రని తీర్చిదిద్దారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో బయోపిక్ రూపొందుతోంది. కాగా ఇప్పటికే ఈ చిత్రంపై మంచి టాక్ రాగా.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు యూ ట్యూబ్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

పవన్ లేదా అబ్బాయ్ అనుకున్నా!

జార్జిరెడ్డి పోస్టర్లు చూసిన తర్వాత ట్రైలర్‌ను చూశా.. చాలా బాగుందని నాగబాబు కితాబిచ్చారు. చాలా ఏళ్లుగా ఆయన గురించి వింటూనే ఉన్నా.. ఆయన పాత్రను తమ్ముడు కల్యాణ్ బాబు లేదా అబ్బాయి వరుణ్‌తో చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించినట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. అంతటితో ఆగని ఆయన.. తాను ఇలా అనుకుంటున్న టైమ్‌లో జీవన్ రెడ్డి ఆ కథతో సినిమా తీసేశారని సంతోషించానన్నారు. అయితే ట్రైలర్ పూర్తిగా చూసిన తర్వాత అలాంటి పాత్రకు పేరున్న నటుడు అంతగా సరిపోడని తనకు అనిపించిందన్నారు.

పవనే గుర్తొస్తాడు!

‘సందీప్ మాధవ్ ఇప్పటివరకు చిన్న పాత్రలే చేశాడు. అతను జార్జిరెడ్డి పాత్రకు సరిపోయాడు. జార్జిరెడ్డి ఒక దిగ్గజ విద్యార్థి. అందుకే ఆయనింటే నాకు ఇష్టం. ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఇస్రోలో ఉద్యోగం వస్తే చేరలేదట. విద్యార్థుల సమస్యల పరిష్కారంకోసం ఆయన వాటిని వదులుకున్నాడు. జార్జి రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ.. ఆయన మేధావి మాత్రమే కాదు, రియల్ హీరో, రియల్ లైఫ్ బాక్సర్. అనేక విద్యల్లో ప్రావీణ్యం ఉంది. జార్జిరెడ్డి ఫొటోలను చూస్తుంటే మా పవనే గుర్తుకొస్తాడు. ఆయన వ్యక్తిత్వం, భావోద్వేగాలు పవన్‌లో కనిపిస్తాయి. జార్జిరెడ్డి జెండాలో పిడికిలి గుర్తు, జనసేన జెండాలో ఉండటం యాదృచ్ఛికం’ అని నాగబాబు చెప్పుకొచ్చారు. కాగా జార్జ్‌రెడ్డి చిత్రం 22న థియేటర్లలోకి రానుంది. మరి జార్జ్‌రెడ్డి ఎలా ఉంటుందో...? ఏ మాత్రం హిట్టవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

జగన్.. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: పవన్ వార్నింగ్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తన పెళ్లిళ్లు, పిల్లలపై వైఎస్ జగన్ మాట్లాడటంతో ఇందుకు స్పందించిన పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్.. మీరూ పెళ్లి చేస్కోండి..: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పెళ్లిళ్లు, పిల్లలపై ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహా ‘పీఠం’పై కూర్చోవాలని అటు బీజేపీ.. ఇటు శివసేన.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీ కూర్చోవాలని విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవన్నీ ఫలించలేదు.

మ‌రోసారి మెగా టైటిల్‌తో

త‌మిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో కార్తి ఒక‌రు. ఆయ‌న హీరోగా న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం `ఖైదీ` తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

'జార్జ్ రెడ్డి' ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ ?

నిజాం క‌ళాశాల‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీల్లో చ‌దువుకునే రోజుల్లో విద్యార్థి నాయ‌కుడిగా ఎంద‌రో విద్యార్థుల‌ను ప్ర‌భావితం చేశారు. కాలేజీ విద్యార్థుల‌కు, రాజ‌కీయాల‌కు ఒక‌ప్పుడు దగ్గ‌ర సంబంధాలుండేవి.