close
Choose your channels

నాగబాబు సొంత ప్రోగ్రామ్!!

Wednesday, July 15, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగబాబు సొంత ప్రోగ్రామ్!!

మెగా బ్రదర్ నాగబాబుకు మంచి క్రేజ్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ జబర్‌దస్త్. ఈ కామెడీషో నుండి నాగబాబు కొన్ని కారణాలతో పక్కకు తప్పుకున్నారు. మరో టీవీలో అదిరింది అనే ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు తనే సొంతంగా ఓ కామెడీ షోను ప్లాన్ చేశాడట నాగబాబు. అయితే ఈ షోను నాగబాబు కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఉపయోగించబోతున్నారట. అలాగే ఈ షో ఇతర టీవీ ఛానెల్స్‌లో ప్రసారం కాదట. ‘మన ఛానెల్ మన ఇష్టం’అనే యూ ట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం అవుతుందట. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది. జబర్‌దస్త్, అదిరింది షోల తరహాలో నాగబాబు చేయబోయే సొంత షోల్లోనూ టీమ్ లీడర్స్ ఉంటారట. అనుభవం ఉన్న టీమ్ లీడర్స్‌తో పాటు, కొత్తవాళ్లు కూడా జాయిన్ అవుతారట. ఈ షో ఏ మేరకు సక్సెస్ అవుతుందో కాదో తెలియదు కానీ.. అదిరింది షోలో మరి నాగబాబు పాల్గొంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రోగ్రామ్ ద్వారా యంగ్ టాలెంట్‌కు అవకాశాలు దక్కి, ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అయితే.. ఇతర ఛానెల్స్‌లో ప్రోగ్రామ్‌ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది.

తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరిన నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపై, సామాజిక పరిస్థితులపై నాగబాబు తనదైన శైలిలో ట్వీట్స్ పెడుతూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు. మరో వైపు ఎలాగూ నాగబాబు సినిమాల్లో తనకు సరిపోయే క్యారెక్టర్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.