కరోనాపై నాగబాబు సెటైర్లు.. నెటిజన్లు కన్నెర్ర

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఈ మధ్య వరుస ట్వీట్స్, పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఈ వైరస్‌పై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్న ఆయన తాజాగా.. సెటైర్ల వర్షం కురిపించారు. ‘కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కారోన వైరస్‌ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీదకి పంపించాడు అని అంటున్నారు. అయినా ఈ దేవుళ్ళకి కోపం ఎక్కువే సుమా..’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్‌ను కామెడీ చేయడమేంటి సారూ.. మీకు తోచిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది పోయి ఇలా చేస్తున్నారేంటి..? అని కన్నెర్రజేస్తున్నారు. ‘గోమూత్రం తాగితే కరోనా చచ్చిపోతుందట కదా.. వాళ్లే కదా గురూ ఇది చేసింది’ అంటూ మరి కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే.. ఇప్పటికే కరోనాపై ఆయన చేసిన ట్వీట్స్‌‌కు తీవ్రస్థాయిలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

More News

శ‌ర్వానంద్‌కి స‌ర్జ‌రీ..?

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌కి స‌ర్జ‌రీ జ‌రిగిందా? అంటే అవుననే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అదేంటి?

‘డియో డియో’ సాంగ్‌కు వంద మిలియన్ వ్యూస్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ చిత్రంలోని ఐటమ్ సాంగ్ ‘డియో డియో డిసక డిసక’ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

కరోనా ఎఫెక్ట్.. పద్మ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా

పద్మ అవార్డుల ప్రదానోత్సవంపై కరోనా ప్రభావం పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తుండటంతో

బ్రేకింగ్ : తెలంగాణలో థియేటర్స్, స్కూల్స్, మాల్స్ బంద్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా తెలుగు రాష్ట్రాలకు పాకిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఉగాది పచ్చడి లాంటి తెలుగు చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' - కళాతపస్వి కె.విశ్వనాథ్

తెలుగు సినీ చరిత్రలో గాని, తెలుగు సినిమా పరిశ్రమలో కానీ సువర్ణ అక్షరాలతో లిఖించ దగిన దర్శకులు ఎవరైనా ఉన్నారంటే అది కళాతపస్వి, తెలుగు సినీసువర్ణ దిగ్గజ దర్శకులు,