థ్యాంక్యూ సీఎం జగన్ గారూ.. : నాగబాబు

నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా అభినందనలు, ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. తాజాగా దీనిపై జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ..మరో రెక్వెస్ట్ చేశారు.

థ్యాంక్యూ జగన్ గారూ..

‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ సీఎం గారు’ అని నాగబాబు ట్వీట్ చేశారు.

నిలుపుదల చేస్తూ ఉత్వర్వులు..

టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలుపుదల చేస్తున్నట్లు సోమవారం నాడు సర్కార్ ప్రకటించింది. 2016 జనవరి 30 టీటీడీ బోర్డు తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30న చేసిన తీర్మానంలో 50 చోట్ల భూములను అమ్మాలని నాటి బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని టీటీడీ బోర్డుకు ప్రభుత్వం సూచించింది. ఆథ్యాత్మిక వేత్తలు, ధర్మ ప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్వర్వుల్లో నిశితంగా పేర్కొన్న విషయం విదితమే.

నోటీసులివ్వడంపై..

హైకోర్టు, న్యాయమూర్తులను విమర్శించడం, అసభ్యంగా మాట్లాడటంతో లక్ష్మీ నారాయణ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సహా 49 మందికి హైకోర్టు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై నాగబాబు స్పందించారు. ‘మన దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికి ఉందంటే అది కేవలం న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయటమే. న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసే ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం చాలా పెద్ద మిస్టేక్. న్యాయ వ్యవస్థ లో మనకి న్యాయం జరగకపోతే పై కోర్ట్ కి వెళ్లటానికి అవకాశం వుంది కదా. కచ్చితంగా కోర్టు నిర్ణయాలని తప్పుపట్టే కామెంట్స్ కానీ, న్యాయ వ్యవస్థ మీద వెటకారం చేసే టీవీ డిబేట్స్ కానీ, న్యాయవ్యవస్థని నిర్వీర్యం చేసే కామెంట్స్ చేసే వాళ్ళకి తగిన విధంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా. న్యాయవ్యవస్థ ఎన్నటికీ నిర్వీర్యం కాకూడదు. మనం న్యాయవస్థను గౌరవించాలి’ అని నాగబాబు ట్వీట్ చేశారు.

More News

హైకోర్టు షాక్ : వైసీపీ ఎంపీ, ఆమంచి సహా 49 నోటీసులు

న్యాయస్థానాలు, న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అలాంటిది అన్నీ తెలిసిన అది కూడా ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు

ఐటెమ్ సాంగ్సే బెట‌రంటున్న ముద్దుగుమ్మ‌

సినీ ఇండ‌స్ట్రీలో ముఖ్యంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టేవారంద‌రూ హీరోనో, హీరోయినో కావాల‌నే అడుగు పెడుతుంటారు. అదే కోరితో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మల్లో హంసానందిని ఒక‌రు.

‘అల వైకుంఠ‌పురములో..’ గ్లోబెల్ రికార్డ్‌

ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లోని పాట‌ల్లో అల వైకుంఠ పుర‌ములో సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాకు రాలేదు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో

మ‌రో పాన్ ఇండియా క‌థ‌లో విజ‌యేంద్ర ప్ర‌సాద్‌

బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్‌జాన్, మ‌ణిక‌ర్ణిక వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు క‌థ‌ల‌ను అందించిన సీనియ‌ర్ స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్.

‘ఆచార్య‌’కు డేట్ ఖ‌రారైందా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.