టీటీడీ ఆస్థులు అమ్మ‌కం.. నాగ‌బాబు ట్వీట్‌

మెగాబ్రదర్ నాగబాబు లాక్డౌన్ వల్ల షూటింగ్స్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఈయ‌న త‌న భావాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇటీవ‌ల నాథూరాం గాడ్సేకు అనుకూలంగా మాట్లాడిన ఆయ‌న‌పై పోలీసు కేసు కూడా న‌మోదైంది. అంతే కాకుండా క‌రెన్సీపై గాంధీజీ ఫొటోను ఎందుకుండాలి? ఆయ‌న బ్ర‌తికుంటే కూడా అదే చెప్పేవార‌ని కూడా ట్వీట్ పెట్టారు. తాజాగా మ‌రో సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేయ‌బోయే ప‌నిని టార్గెట్ చేస్తూ నాగ‌బాబు చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇత‌ర ప్రాంతాల్లోని టీటీడీకి చెందిన 23 స్థ‌లాల‌ను అమ్మాల‌నుకుంటోంది. దీనిపై నాగ‌బాబు ట్వీట్ చేశారు.

‘‘తిరుపతి వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను’’ అన్నారు నాగబాబు. ఈయన చేస్తోన్న ట్వీట్స్‌పై జ‌న‌సేన పార్టీ కూడా స్పందించింది. నాగబాబు చేస్తోన్న ట్వీట్స్ ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని, దానికి పార్టీకి సంబంధం లేద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలిపారు.

More News

‘నో పెళ్లి...’ వీడియో సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్ తేజ్‌, రానా సంద‌డి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`.

సినీ ఇండస్ట్రీకి గుడ్ బై.. యాంకరింగ్‌కు సై అంటున్న సురేఖా..!

సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ.. బుల్లితెరను ఏలుతున్న రారాణులు.! టీవీ షోలతో తెలుగింట ప్రతి ఒక్కరికీ పరిచయమైన ఈ యాంకర్ల జాబితాలోకి తాజాగా మరో పేరు చేరబోతుందా..?

థియేటర్ల ఓపెనింగ్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ క్లారిటీ..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌‌తో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్లు మూసివేసిన విషయం విదితమే.

జూన్-1న సీఎం జగన్‌ను చిరు కలవబోతున్నారా!?

జూన్-01న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మెగాస్టార్, టాలీవుడ్ పెద్దన్న చిరంజీవి కలవబోతున్నారా..? ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

సోనూసూద్‌కు చేతులెత్తి నమస్కరించిన స్మృతీ ఇరానీ

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చిన విషయం విదితమే.