గాంధీ సిద్ధాంతాల‌పై నాగబాబు ట్వీట్స్‌

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈ మ‌ధ్య ట్విట్ట‌ర్‌లోయాక్టివ్‌గా ఉంటున్నారు. దీని ద్వారా ఆయ‌న విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. వివాదాల‌కు కేరాఫ్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయ‌న ఇటీవ‌ల గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేను స‌మ‌ర్ధించ‌డం, క‌రెన్సీ నోట్ల‌పై గాంధీ బొమ్మ‌నే ఎందుకు ఉండాలి? అంటూ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా గాంధీ సిద్ధాంతాలు శాంతి, అహింసల‌పై ట్వీట్స్ చేశారు.

‘‘భారతీయుల రక్తం శాంతి,అహింస మంత్రాలతో చల్లబడిపోయింది.తిరిగి రక్తం వేడెక్కాలంటే ఛత్రపతి శివాజీ,రాణా ప్రతాప్ సింగ్,అశోక చక్రవర్తి,సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్,శ్రీకృష్ణ దేవరాయలు,రాజ రాజ చోళుడు,సముద్రగుప్తుడు,మొదలైన మహావీరుల కథలని పిల్లలతో చదివిస్తే నెక్స్ట్ జనరేషన్ ఆయినా సాహసం,పౌరుషం, మరిగే రక్తంతో పెరుగుతారు. ఎలాగూ మన రక్తం చల్లబడి పోయింది. వాళ్ళనన్నా దేశానికి ఉపయోగ పడే వీరులు గా తయారు చేద్దాం. భారత దేశానికి, దేశాన్ని ప్రేమించేవీరులు కావాలి, డబ్బుకు ఓట్లు వేసే సాధారణ పౌరులు కాదు.దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశద్రోహులు, గూండాలు, మాఫియా,ఫ్యాక్షన్ గూండా రాజకీయనాయకులు, కుహనా ఉదారవాదులు, ఉగ్రవాదుల నుంచి ఈ దేశాన్ని కాపాడే వీరులు కావాలని నా కోరిక. ప్రతి నేరాన్ని పోలీస్ ,మిలిటరీ మాత్రమే డీల్ చెయ్యాలంటే కుదరని పని’’ అన్నారు నాగ‌బాబు. ఇప్పుడు నాగ‌బాబు చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నాయ‌కులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

More News

సిద్ధంగా ఉన్న జ‌క్క‌న్న‌..!!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై బాల‌య్య ఏమ‌న్నారంటే..?

అగ్ర క‌థానాయ‌కుడు, ఎం.ఎల్‌.ఎ నంద‌మూరి బాల‌కృష్ణ సినీ ఇండ‌స్ట్రీలోని కొన్ని విష‌యాల గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

మేం వైసీపీలో చేరట్లేదు.. టీడీపీ ఎమ్మెల్యేల క్లారిటీ

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగలనుందని.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి టాటా చెప్పడానికి సిద్ధమైపోయారని..

ఆర్థిక ఇబ్బందులపై సీనియర్ నటి రాశి స్పందన

బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించిన రాశి.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు వంటి హీరోలతో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు మంచి పేరు తెచ్చుకుంది.

నేను ఎవరికీ భయపడను.. : బాలయ్య

టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా సీనియర్ హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించడం.. ఇలా వివాదం ముదిరింది.