మ‌రోసారి గాంధీజీపై సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేసిన నాగ‌బాబు

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ట్విట్ట‌ర్ వేదికగా సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఆయ‌న నాధూరాం గాడ్సేకు అనుకూలంగా చేసిన ట్వీట్స్‌పై పెద్ద దుమార‌మే రేగింది. కాంగ్రెస్ నాయ‌కులు నాగ‌బాబుపై కేసు కూడా పెట్టారు. ఈ దుమారం త‌గ్గ‌క ముందే మ‌రోసారి గాంధీజీపై నాగ‌బాబు మ‌రో సెన్సేష‌న‌ల్ ట్వీట్ చేశారు. క‌రెన్సీ నోట్ల‌పై గాంధీజీ బొమ్మ‌నే ఎందుకు ఉండాలి? అనే దానిపై నాగ‌బాబు చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే..ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారు.దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదు.భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’’ అంటూ నాగ‌బాబు చేసిన ట్వీట్స్‌పై ఎవ‌రెలా స్పందిస్తారో చూడాలి.

More News

నిర్మాత రిక్వెస్ట్.. మారుతి వెబ్ సిరీస్‌

ఓటీటీ మాధ్య‌మాలు జోరును ముందుగానే ఊహించిన తెలుగు నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఒక‌రు. అందుక‌నే ఆయ‌న తెలుగులో ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి తీసుకొచ్చారు.

శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా కన్ఫార్మ్

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది.ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే..

సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

సీనియర్ నటి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం వాణిశ్రీకి పుత్రశోకం కలిగింది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ చెన్నైలోని తన ఇంట్లో చనిపోయారు.

టీటీడీ ఆన్‌లైన్ సేవ‌ల వెబ్‌సైట్ మార్పు వెనుక..!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

తెలంగాణ పది పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర హైకోర్టు ఇటీవలే పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.