హిమాలయాల్లో నాగ్.. ట్విట్టర్ వేదికగా చెప్పిన విక్కీ కౌశల్..

  • IndiaGlitz, [Sunday,October 25 2020]

వీకెండ్ వచ్చిందంటేనే బిగ్‌బాస్ షోకి చాలా హైప్ క్రియేట్ అవుతుంది. దానికి కారణం హోస్ట్ నాగార్జున. నాగ్ వస్తున్నారంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈ శని, ఆదివారాల్లో మాత్రం నాగ్ కనిపించలేదు. ఆ లోటు కనిపించకుండా చేయడానికి శనివారం ఏదో నడిపించేశారు. కానీ ఆదివారం మాత్రం అక్కినేని వారి కోడలు సమంత వచ్చి ఆ లోటును మాత్రం చాలా వరకూ భర్తీ చేయగలిగింది. కానీ నాగ్ ఏమయ్యారు? అనేదే అందరి డౌట్.

ప్రస్తుతం నాగ్ ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని నటుడు విక్కీ కౌశల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన తండ్రి శ్యామ్ కౌశల్ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాలయాల్లో జరుగుతోంది. కాబట్టి నాగ్ ‘వైల్డ్ డాగ్’ కోసం హిమాలయాల్లో ఉన్నారని విక్కీ కౌశల్ వెల్లడించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో నాగ్‌కు జోడిగా దియా మీర్జా నటిస్తోంది. సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అహిషోర్ సోల్‌మేన్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దాదాపు ఆరు నెలల తర్వాత నాగ్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్‌కి పూర్వమే ఈ చిత్రం చాలా వరకూ పూర్తైంది. ప్రస్తుతం మిగిలిన భాగాన్ని పూర్తి చేసుకుంటోంది.

More News

ముగ్గురు హీరోయిన్లతో కలిసి నటించనున్న కె.రాఘవేంద్రరావు..

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నటుడి అవతారమెత్తబోతున్నారు. కొత్త మూవీలో లీడ్ రోల్ పోషించేందుకు సర్వం సిద్ధమైంది.

సమంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు.. ఏడిపించబోతోంది..

బిగ్‌బాస్ సీజన్ 4. వీకెండ్‌కి సమంత రాబోతోంది. ఈ రోజు షో మొత్తం ఆమెదే. ఇవాళ ప్రోమోను స్టార్ మా యాజమాన్యం విడుదల చేసింది.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్: నాకు కాబోయే వాడు షూస్‌తో సమానం..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు దసరా సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  సితార ఎంటర్ టైన్మెంట్స్

తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇదే తొలిసారి...

వీకెండ్‌ షోకి హోస్ట్ నాగార్జున డుమ్మా. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలా వీకెండ్‌ హోస్ట్ లేకుండా నడవడం ఇదే తొలిసారి అయ్యుండొచ్చు.