నాని కార‌ణంగా నాగ్ వెనక్కి..

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ముందుగా నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 29న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే ఆగ‌స్ట్ 30న నాని 'గ్యాంగ్ లీడ‌ర్' కూడా వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించాడు.

రెండు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌టం నాగ్ అండ్ టీం ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీని కార‌ణంగా మ‌న్మ‌మ‌థుడు 2 చిత్రాన్ని సెప్టెంబ‌ర్ రెండో వారంలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

2003లో విడుద‌లైన 'మ‌న్మ‌మ‌థుడు' ఇన్‌స్పిరేష‌న్‌తో 'మ‌న్మ‌మ‌థుడు 2' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. రీసెంట్‌గా పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశార‌ట‌.