close
Choose your channels

అది నాది కాదంటున్న నాగ్‌!

Saturday, June 15, 2019 • తెలుగు Comments

అది నాది కాదంటున్న నాగ్‌!

తెలుగు ఇండ‌స్ట్రీ మ‌న్మ‌థుడు, అక్కినేని వార‌సుడు నాగార్జున శ‌నివారం ఓ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు. అదీ అకౌంట్‌కు సంబంధించి. అదేదో బ్యాంక్ అకౌంట్ అని అనుకోకండి. అది పూర్తిగా సోష‌ల్ మీడియా అకౌంట్‌. ఆయ‌న పేరు మీద ట్విట్ట‌ర్‌లో ఓ అకౌంట్ ఉంది. అది అక్ష‌రాలా ఆయ‌న‌దే. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న‌కు అకౌంట్ లేదు. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌టాన్ని గ‌మనించిన ఓ వ్య‌క్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఐయామ్ నాగార్జున పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేశారు.

అంద‌రూ దాన్ని హీరో నాగార్జున అకౌంట్ అని భ్ర‌మ‌ప‌డుతున్నారు. ఈ విష‌యం నాగార్జున దృష్టికి వ‌చ్చిన‌ట్టుంది. అందుకే ఆయ‌న ఈ విష‌యంపై క్లారిటీ ఇచ‌చారు. ఐయామ్ నాగార్జున అనే పేరుతో ఉన్న అకౌంట్ త‌న‌ది కాద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఒక‌వేళ తాను ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ప్రారంభిస్తే, ఆ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటాన‌ని కూడా అన్నారు. నాగార్జున ప్ర‌స్తుతం మ‌న్మ‌థుడు2లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల టీజ‌ర్‌లో మూతిముద్దుల‌తో చెల‌రేగిపోయారు. వాటిని చూసిన అమ‌ల‌, కుమారుడు అఖిల్ కూడా నాగార్జున‌ను ప్ర‌శంసిస్తూ ట్వీట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

Get Breaking News Alerts From IndiaGlitz