close
Choose your channels

కీర్తి, అర్జున్‌లను నేరుగా నామినేట్ చేసిన నాగ్... గీతూకి ఝలక్

Sunday, September 25, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందరూ ఎంతగానో ఎదురుచూసే బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఆయన ఎవరికి క్లాస్ పీకుతారో, ఎవరికి కాంప్లిమెంట్స్ ఇస్తారో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తారు. మరి ఆ వివరాలేంటో చూస్తే. స్టేజ్ మీదకి వచ్చి రావడంతోనే నాగార్జున చాలా సీరియస్‌గా కనిపించారు. గత వారం సరిగా ఆడని వారు సోఫా వెనక్కి వెళ్లి నిలబడ్డారు. వారిలో శ్రీసత్య, శ్రీహాన్ బాగా ఆడారని సోఫాలో కూర్చొమని నాగ్ ఆదేశించారు. సాఫ్ట్‌గా వుంటూ.. ఇంట్లో పెద్దన్నయ్య మాదిరిగా వ్యవహరిస్తున్న బాలాదిత్యకు క్లాస్ తీసుకున్నారు నాగార్జున. అతనికి సంబంధించిన వీడియోను ప్లే చేయించిన ఆయన.. అడవిలో ఆట టాస్క్‌లో ఇనయాను నలుగురు ఈడ్చుకెళ్తుంటే, పెద్ద గొడవ జరుగుతుంటే బాలాదిత్య మాత్రం కూర్చొని వేడుక చూస్తున్నాడు. దీనిపై నాగ్ ప్రశ్నించగా.. సార్ అప్పుడు తాను పోలీస్ కంటే మనిషిగా ఆలోచించాను అని సమాధానం ఇచ్చాడు.

ఇక హౌస్‌లో సందడి చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న గీతూపైనా నాగార్జున కోప్పడ్డాడు. నోటిదూల ఎక్కువైందమ్మా.. కాస్త తగ్గించుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అలాగే ఈసారి చాలా పిట్టకథలు చెప్పాలంటూ.. గీతూ, ఇనయా, శ్రీహాన్‌ల మధ్య జరిగిన ‘పిట్ట’ గొడవను కదిపారు నాగ్. ఆయన ఆ మాట అనగానే ఈ ముగ్గురి ముఖాలు మాడిపోయాయి. అయితే అందరినీ సున్నితంగా క్లాస్ పీకి వదిలేశారు నాగ్. క్లోజ్‌నెస్ లేనప్పుడు ఇష్టమొచ్చినట్లు పిలవొద్దని ఇనయాకు చెప్పారు నాగ్.

రోహిత్ కపుల్ మరింత ఇంప్రూవ్ అవ్వాలని, చిన్న చిన్న విషయాలకు కూడా కీర్తి ఏడుస్తోందని.. బాగా ఆడితే ఏడవాల్సిన పనిలేదని చెప్పారు. అలాగే నేహాను ఇనయా చెంపదెబ్బ కొట్టిందన్న దానిపైనా నాగ్ స్పందించారు. నిజానికి టాస్క్ సందర్భంగా నేహా ఫేస్‌పై ఇనయా రాసుకుంటూ వెళ్లిందని, దానిని కొట్టడం అనరని నాగ్ స్పష్టం చేశారు. దీంతో నేహా సారీ చెప్పింది.

ఇకపోతే.. ఫైమా బాగా ఆడుతోందని ఆమెకు 9 మార్కులు ఇచ్చిన నాగ్.. సూర్యను కూడా పర్లేదన్నారు. గీతూ, ఆదిరెడ్డిలకు పదికి పది మార్కులు కట్టబెట్టారు. చంటి, రాజ్ సరిగ్గా ఆడటం లేదంటూ సోఫా వెనక్కి వెళ్లమన్నారు. ఇదే సమయంలో సోఫా వెనుక వున్న ఎనిమిది మంది ఆటతీరును ఇంప్రూవ్ చేయడం కోసం బిగ్‌బాస్ నాగార్జునకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఇద్దరిని నేరుగా ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయొచ్చని చెప్పాడు. అయితే నాగ్ ఆ అవకాశం కూర్చొన్న సభ్యులకు ఇచ్చాడు. సోఫా వెనక వున్న వారిలో నామినేషన్ కోసం ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారంటూ నాగ్ అడగా.. చంటికి ఒక ఓటు, రాజ్‌కి 4, అర్జున్ కళ్యాణ్‌కి 5, బాలాదిత్యకు 3, వాసంతికి 2, మెరీనా రోహిత్‌లకు 1, సుదీపకు 3, కీర్తికి 5 ఓట్లు వచ్చాయి. వీరిలో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అర్జున్, కీర్తిలను నేరుగా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు నాగ్.

కాగా... ఈ వారం నామినేషన్‌లలో వాసంతి, బాలాదిత్య, చంటి, ఆరోహి, నేహా చౌదరి, ఇనయా, శ్రీహాన్, రేవంత్, గీతూలు వున్నారు. అందరికంటే తక్కువ ఓటింగ్ వాసంతి ఈ వారం ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దానిని బట్టి నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటూ రేపటి వరకు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.