close
Choose your channels

నాగ్ విశ్వరూపం.. ‘ఫాల్తు’ పనులేంటి.. తమన్నా ఔట్!

Sunday, August 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ్ విశ్వరూపం.. ‘ఫాల్తు’ పనులేంటి.. తమన్నా ఔట్!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ ఎపిసోడ్‌.. ఎపిసోడ్‌కు ఎక్కడికో వెళ్లిపోతోంది. షో ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకూ హోస్ట్ నాగార్జున నవ్వుతూనే మాట్లాడారంతే.. అయితే మునుపెన్నడూ లేని విధంగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కింగ్ ఆగ్రహంతో ఊగిపోయారు. 21వ ఎపిసోడ్‌లో మాత్రం తన విశ్వరూపం చూపించారని చెప్పుకోవచ్చు. హౌస్‌లో హద్దులు దాటుతున్న కంటెస్టెంట్లకు నాగ్ చుక్కలు చూపించారు. ముఖ్యంగా హౌస్‌లో రచ్చరచ్చ చేస్తున్న అలీ రెజా, తమన్నా సింహాద్రి, రాహుల్‌ సిప్లిగంజ్‌కు క్లాస్ పీకారు. అసలు ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగింది..? నాగ్ ఎందుకంతలా సీరియస్ అయ్యారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

అన్ని విషయాలూ..!

21వ ఎపిసోడ్‌లో మొత్తం.. తప్పులు చేసిన వారికి క్లాస్‌లు పీకడం.. మరోవైపు తమన్నాతో మీడియాకు క్షమాపణలు చెప్పించడమే సరిపోయింది. మొదట హౌస్‌లోకి వచ్చీ రాగానే.. తప్పులు చేసినవారందరికీ క్లాసులు పీకుతూ సీరియస్‌గా సాగుతున్న షోలోకి నాగ్ మళ్లీ వినోదాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అలీని హిమజ తన్నిన విషయం కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. మరోవైపు.. సీరియల్ నటుడు రవికృష్ణకు చేయి తెగినప్పుడు రాహుల్ కాస్త ఆవేశంగా కనిపించిన విషయం తెలిసిందే.

ఫాల్తు మాటలొద్దు కింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!

మొత్తం శ్రీముఖి వల్లే ఇలా జరిగిందని.. ‘ఈ ఫాల్తు ఐడియాలు.. ఫాల్తు మొహంది’ అంటూ అతిగా మాట్లాడాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నాగ్.. ‘అందరూ శ్రీముఖి మీద పడ్డారేం..’ అంటూ కన్నెర్రజేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీముఖికి నాగ్ అండగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రాహుల్ మళ్లీ కలుగజేసుకోవడంతో.. ‘రాహుల్ నీకు ఇది ఆఖరి వార్నింగ్.. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు.. ఫాల్తు మాటలు మాత్రం వద్దు’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగ్. విషయం ఎంత సీరియస్ అయినప్పటికీ ‘ఫాల్తుది, యాంకరింగ్ చేసుకునేది’ అంటూ ప్రొఫెషన్‌ను అవమానించడం తప్పని రాహుల్‌కు కింగ్ గట్టిగానే క్లాస్ పీకారు. దీంతో చేసేదేమీ లేక రాహుల్‌ ఓ మెట్టు దిగి మరీ శ్రీముఖికి సారీ చెప్పాడు.

లగేజీ సర్దేయండి!

అయితే ఈ రచ్చ మధ్యే ఎలిమినేషన్ ప్రస్తావన రావడంతో అందరి ముఖాలు ఎలాగో అయిపోయాయి. నామినేట్ అయిన పునర్నవి, రాహుల్, బాబా భాస్కర్, వితికా షెరు, తమన్నాలను లగేజ్ మొత్తాన్ని సర్దుకుని స్టోర్ రూంలో పెట్టాలని నాగార్జున సూచించారు. వాళ్లంతా తమ లగేజీలను స్టోర్ రూంలో పెట్టేశారు. స్టోర్ రూంలో ఎవరి లగేజ్ అయితే ఉండదో వారు ఈ షో నుంచి ఎలిమినేట్ అయినట్టని నాగార్జున చెప్పారు.

ఇవాళ ఎలిమినేట్ అయ్యేది ఈమేనా!

నేడు తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కానుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాగా.. హౌస్‌లోకి ప్రవేశించిన నాటి నుంచి ట్రాన్స్ జెండర్ తమన్నా కంటెస్టెంట్లతో పాటు హోస్ట్‌ నాగ్‌కు కూడా తలనొప్పి తెప్పించింది. దీంతో ఆమెను బయటకు పంపించాలని మిగతా కంటెస్టెంట్లు, బిగ్‌బాస్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇదే జరిగితే సగం తలనొప్పి తగ్గినట్లేనని.. ఇక నుంచి సాఫీగా షో నడుస్తుందని బిగ్‌బాస్ ప్రియులు చెబుతున్నారు. మరి ఇవాళ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.