మరోసారి సెంటిమెంట్ ఫాలో అవుతున్న నాగ్..

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున - అందాల తార అనుష్క క‌లిసి న‌టిస్తే...ఆ సినిమా సూప‌ర్ హిట్ అనే సెంటిమెంట్ ఉంది. ఈ విష‌యం నాగార్జున‌కు బాగా తెలుసు. అందుక‌నే ఏమాత్రం అవ‌కాశం ఉన్నా...నాగార్జున త‌న సినిమాలో అనుష్క‌తో స్పెష‌ల్ సాంగో - స్పెష‌ల్ క్యారెక్ట‌రో చేయిస్తుంటారు. ఇటీవ‌ల సోగ్గాడే చిన్ని నాయ‌నా - ఊపిరి చిత్రాల్లో అనుష్క తో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ చేయించారు.
ఈ రెండు చిత్రాలు ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాయో తెలిసిందే. ఫ‌స్ట్ టైం సూప‌ర్ సినిమాలో న‌టించిన నాగ్ - అనుష్క ఆత‌ర్వాత ర‌గ‌డ‌, ఢ‌మ‌రుకం, కేడి, కింగ్ చిత్రాల్లో న‌టించారు. అయితే వీరిద్ద‌రు క‌ల‌సి న‌టించిన చిత్రాల్లో కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే...ఇటీవ‌ల నాగ్ తో క‌ల‌సి అనుష్క న‌టించిన సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి చిత్రాలు సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో...నాగ్ నెక్ట్స్ మూవీలో కూడా అనుష్క‌తో ఓ స్పెష‌ల్ రోల్ చేయిస్తున్న‌ట్టు స‌మాచారం. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున న‌టిస్తున్న భ‌క్తిర‌స చిత్రంలో అనుష్క ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తుంద‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే...సెంటిమెంట్ ప్ర‌కారం నాగార్జున‌ వ‌రుస‌గా నాలుగ‌వ‌ విజ‌యం సాధించ‌డం ఖాయం.

More News

మ‌హేష్ హ్యాండ‌స‌మ్ లుక్స్ వెన‌కున్న సీక్రెట్స్ ఇవే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎంత అందంగా ఉంటాడో...ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అలాగే మ‌హేష్ వ‌య‌సు న‌ల‌భై ఏళ్లు అంటే..అవునా.. అని ఆశ్చ‌ర్య‌పోతారు..కానీ..ఇది నిజం.. మ‌హేష్ వ‌య‌సు పెరుగుతున్న కొద్దీ మ‌రింత అందంగా త‌యార‌వుతున్నాడు.

ఏప్రిల్ 29న విడుదలకు 'జీలకర్ర బెల్లం' రెడీ

అభిజిత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'జీలకర్ర బెల్లం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది.

చరణ్ - విలన్ - డైరెక్షన్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విలన్ డైరెక్షన్ చేస్తానంటున్నారు.ఇంతకీ ఎవరా చరణ్-విలన్ అని తెగ ఆలోచిస్తున్నారా..?ఆయనే అరవింద్ స్వామి.

శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హ్యాట్రిక్ చిత్రం

లౌక్యం, డిక్టేటర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా సినిమా రూపొందనుంది. గోపీచంద్ హీరోగా, గతంలో లక్ష్యం, లౌక్యం వంటి రెండు సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఎట్టకేలకు సూర్య, అనుష్కల పెళ్లి జరిగింది...

సూర్య, అనుష్కలకు పెళ్లేంటనుకుంటున్నారా? రియల్ లైఫ్ లో కాదులెండి..రీల్ లైఫ్ లో, సూర్య, అనుష్క జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న సక్సెస్ ఫుల్ చిత్రం సింగం ఇప్పుడు మూడో సీక్వెల్ ఎస్3 చిత్రీకరణ జరుపుకుంటుంది.