బాహుబ‌లి 2 కోసం నాగార్జున‌..!

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

బాహుబలి 2 ఓ వైపు షూటింగ్ జ‌రుగుతుండ‌గానే...మ‌రో వైపు చ‌క‌చ‌కా బిజినెస్ జ‌రిగిపోతుంది. ఇంత‌కీ బాహుబ‌లి 2 కోసం నాగార్జున..? ఏమిటి అనుకుంటున్నారా..? బాహుబ‌లి 2 కృష్ణా జిల్లా రైట్స్ ను నాగార్జున‌, సాయి కొర్ర‌పాటి ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. బాహుబ‌లి 2 కోసం నాగార్జున రంగంలోకి దిగడం ఓ విశేష‌మైతే... 8 కోట్లు చెల్లించి కృష్ణా జిల్లా రైట్స్ ద‌క్కించుకున్న‌ట్టు మ‌రో విశేషం అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

బాహుబ‌లి కృష్ణా జిల్లా రైట్స్ ను 6.8 కోట్ల‌కు అమ్మితే...ఇప్పుడు బాహుబ‌లి 2 రైట్స్ 8 కోట్ల‌కు అమ్మారంటే ఈ మూవీ పై ఎంత క్రేజ్ ఉందో అర్ధ‌మ‌వుతుంది. ఇక‌ మిగిలిన ఏరియాల్లోను, అలాగే ఓవ‌ర్ సీస్ లోను కూడా బాహుబ‌లి 2కు భారీ రేటు ఖాయం అనిపిస్తుంది. ఇదే క‌నుక జ‌రిగితే...బాహుబ‌లి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా కొత్త రికార్డ్ సృష్టించ‌డం ఖాయం..!

More News

అథ్లెటిక్ పాత్ర‌లో ర‌కుల్‌...

ప్ర‌స్తుతం  సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ల చిత్రంతో పాటు మెగా ప‌వ‌ర్‌స్టార్  రామ్ చ‌ర‌ణ్ ధృవ చిత్రంతో పాటు సాయిద‌ర‌మ్ తేజ్, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తుంది.

ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన వినాయ‌క్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌150 చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

చిరు- నాగ్ - స‌చిన్ లుంగీ డ్యాన్స్..!

కేర‌ళ బ్లాష్ట‌ర్స్ జ‌ట్టుకు స‌చిన్ టెండూల్క‌ర్, చిరంజీవి, నాగార్జున‌, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్, అల్లు అర‌వింద్ స‌హ య‌జ‌మానులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ కేర‌ళ బ్లాష్ట‌ర్స్ జ‌ట్టు మూడో సీజ‌న్ కు రెడీ అవుతున్నారు.

మన ఊరి రామాయణం సస్పెన్స్ టీజర్ రిలీజ్..!

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం.

క్రిస్మస్ రేసులో నాని...

నేచురల్ స్టార్ నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న చిత్రం