close
Choose your channels

'దేవ‌దాస్' పెగ్(టీజ‌ర్‌) రేపే

Thursday, August 23, 2018 • తెలుగు Comments

అక్కినేని నాగార్జున‌, నాని హీరోలుగా రూపొందుతున్న చిత్రం `దేవ‌దాస్‌`. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో సి.అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్లైమాక్స్ మిన‌హా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌యింది. ఇప్పుడు క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ బ్యాంకాక్‌లో జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ 27న సినిమా విడుద‌ల కానుంది.

ఒక నెల మాత్ర‌మే స‌మయం ఉండ‌టంతో ఒక‌వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్నాయి.  ఆకాంక్ష సింగ్‌, ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ను రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.