చైతు మూవీ గురించి నాగ్..!

  • IndiaGlitz, [Monday,November 28 2016]

ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో...ఈ రెండు చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్ ర‌ష్ ను నాగార్జున ఇటీవ‌ల చూసార‌ట‌. నాగ్ బాగా వ‌చ్చింద‌ని చెప్ప‌డంతో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. త‌దుప‌రి షెడ్యూల్ విశాఖ‌లో రెండు వారాలు పాటు జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఈ చిత్రం నిన్నే పెళ్లాడ‌తా త‌ర‌హాలో ఉంటుంది. అందుచేత ఈ చిత్రానికి టైటిల్ నిన్నే పెళ్లాడ‌తా అంటూ ప్ర‌చారం జ‌రిగింది కానీ...నాగ్ ఆ టైటిల్ వ‌ద్దు అని చెప్ప‌డంతో క‌ళ్యాణ్ కృష్ణ వేరే టైటిల్ కోసం ఆలోచిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో హీరోయిన్ గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంటే....జ‌గ‌ప‌తిబాబు కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

More News

గౌత‌మీపుత్రశాత‌క‌ర్ణి ఆడియో & ర‌న్ టైమ్ డీటైల్స్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విజయం సాధించాలి అని కోరుకుంటూ అభిమానులు ఫిల్మ్ న‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో రుద్రాభిషేకం నిర్వ‌హించారు.

ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మూవీ షూటింగ్ డీటైల్స్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో మూడ‌వ చిత్రం ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే.

చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నతాజా చిత్రం ధృవ. స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ గా రూపొందిన ధృవ  చిత్రం  ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఓం నమో వేంకటేశాయ అప్పుడు రిలీజ్ అయితే గొప్పే - నాగ్..!

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్నభక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

మహేష్ మూవీకి తమన్ మ్యూజిక్..!

సూపర్ స్టార్ మహేష్,మ్యూజిక్ డైరెక్టర్ తమన్....వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దూకుడు,