బాలయ్యతో గొడవలేం లేవు - నాగార్జున

  • IndiaGlitz, [Sunday,April 09 2017]

నంద‌మూరి ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ‌, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు నాగార్జున వారి న‌ట వార‌సులుగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మూడు ద‌శాబ్దాలుగా అగ్ర క‌థానాయ‌కులుగా రాణిస్తున్న వీరిద్ద‌రి మ‌ధ్య బేదాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని, అందుకే ఇద్దురూ ఎడ‌మొహం, పెడ‌మొహంగా ఉంటున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. జ‌రుగుతున్న ప‌రిస్థితులు కూడా ఈ వార్త‌ల‌కు బ‌లాన్నిస్తూ వ‌చ్చాయి.

అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఎటువంటి గొడ‌వ‌లు లేవ‌ని నాగార్జున విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన టి.ఎస్‌.ఆర్‌- టి.వి9 అవార్డ్స్ వేదిక‌పై చెప్పుకొచ్చారు. బాల‌కృష్ణ‌, నాగార్జున వేదిక‌పై క‌ర‌చాల‌నం ఇచ్చుకోవ‌డ‌మే కాకుండా ఒక‌రికి వ‌చ్చిన అవార్డుల‌ను మ‌రొకరికి అంద‌జేసుకున్నారు. ఇలా ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు ఒక్క‌ట‌వ్వ‌డం వారి అభిమానుల‌కు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ కార్య‌క్ర‌మంలో రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు స‌హా పలువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

More News

వన్ మిలియన్ టచ్ చేసిన 'జై లవకుశ' టీజర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో హీరో నందమూరి కళ్యాణ్రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై

తండ్రిలా పవర్ స్టార్ కాకూడదు

ఈరోజు పవర్స్టార్ పవన్కళ్యాణ్ తనయుడు అకీరానంద్ 13వ పుట్టినరోజు. అకీరా పుట్టినరోజు సందర్భంగా తల్లి రేణుదేశాయ్ కొడుక్కి విషెష్ చెప్పింది. రేణు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న'అనుకోని ఓ కథ'

ఏ ఎం జె ఫిలిమ్స్ పతాకంపై దర్శక నిర్మాత ఏ ఎం జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'అనుకోని ఓ కథ '.

మురుగదాస్ ఫైర్ అయ్యాడు

సినిమాలకు సంబంధించిన నంది, జాతీయ అవార్డులు ప్రకటించిన ప్రతిసారి అవార్డ్స్ జ్యూరిని ఎవరో ఒకరు విమర్శిస్తుంటారు. రీసెంట్గా 64వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

సమంత మూగదా..?

ప్రస్తుతం మెగావపర్ స్టార్ రాంచరణ్ తో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.