close
Choose your channels

అభిమానులకు కానుక సిద్ధం చేస్తున్న నాగ్!!

Friday, August 7, 2020 • తెలుగు Comments

అభిమానులకు కానుక సిద్ధం చేస్తున్న నాగ్!!

ఈ ఆగ‌స్ట్ 29న కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ నుండి టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే అగ్ర క‌థానాయ‌కుల్లో కింగ్ నాగార్జున ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత నాగార్జున అండ్ టీమ్ ఈ సినిమాను పూర్తి చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నారు.

మ‌రో వైపు క‌రోనా టైమ్‌లోనూ నాగార్జున బిగ్‌బాస్ సీజ‌న్ 4 కోసం నాగార్జున స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న న‌టించిన బిగ్‌బాస్ యాడ్ ప్ర‌సారం కానుంది. ఈ నెలాఖ‌రులో బిగ్‌బాస్ 4 స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘వైల్డ్ డాగ్‌’ పూర్తి కాగానే రాజ‌శేఖ‌ర్‌తో ‘పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ’ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వంలో, మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz