close
Choose your channels

పోర్చుగల్‌లో నాగ్, రకుల్ జిమ్ వర్కవుట్స్.. వీడియో రిలీజ్!

Friday, April 26, 2019 • తెలుగు Comments

పోర్చుగల్‌లో నాగ్, రకుల్ జిమ్ వర్కవుట్స్.. వీడియో రిలీజ్!

కింగ్ నాగార్జున హీరోగా 'మనం' ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం 'మన్మథుడు 2'. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. హైదరాబాద్‌తో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్ నిమిత్తం పోర్చుగల్‌కు వెళ్లింది.

అక్కడే ఎక్కువ శాతం షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. పోర్చుగల్‌లో నాగార్జున ఫిట్‌నెస్ కోసం చేస్తోన్న కసరత్తులకు సంబంధించిన ఫొటోలు ఇటీవల బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నాగ్, రకుల్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ వర్కవుట్ వీడియో సారాంశం ఇదీ.. 

నాగ్: హే.. రాహుల్ నువ్వేంటి ఇక్కడ..? అని డైరెక్టర్‌ను నాగ్ అడగ్గా..

డైరెక్టర్: షాట్ రెడీ అయిపోయింది సార్.

నాగ్: జిమ్ భలే ఉంది కదా.. మన దగ్గరకూడా ఉండుంటే బాగుండేది

డైరెక్టర్: చాలా బాగుంది జిమ్.. రకుల్ ఎక్కడ..!?

నాగ్: రకుల్‌ను చూపిస్తూ.. రాహుల్ వర్కౌట్ చేయనివ్వు ఆ అమ్మాయిని. లుకింగ్ ఇన్‌క్రెడిబుల్. ఈ వర్కౌట్ వల్లే ఆమె అలా ఉంది. ఆమెను పూర్తిచేయనివ్వు. షాట్ నా మీద తీయి. ఆమె వర్కౌట్ అయిన తరవాత వస్తుంది.. ఓకే... పదా.. ! అంటూ మన్మథుడు-డైరెక్టర్ మధ్య సంభాషణ జరుగుతుంది. 

ఈ వీడియో చూసిన అక్కినేని, రకుల్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సార్.. సింగిల్ షాట్‌ను రిలీజ్ చేయొచ్చు కదా అంటూ డైరెక్టర్‌ను అభిమానులు రెక్వెస్ట్ చేస్తున్నారు.

వావ్.. నాగ్ సార్ సూపర్.. రియల్లీ మీరు ఎవర్‌గ్రీన్ సార్.. అని అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒకే ఒక్క స్టైలిష్ స్టిల్ వదలండి సార్.. అని అభిమానులు కోరుతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz