సమంత-నాగచైతన్య విడాకులపై నేనేం మాట్లాడలేదు.. అదంతా అవాస్తవం: నాగార్జున ట్వీట్

  • IndiaGlitz, [Friday,January 28 2022]

సమంత-నాగచైతన్యల విడాకులకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అగ్ర కథానాయకుడు నాగార్జున స్పష్టం చేశారు. తొలుత సమంతనే విడాకులు కావాలని కోరిందంటూ ఓ ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పారని గురువారం ఉదయం నుంచి మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. నాగచైతన్య-సమంత గురించి నేను మాట్లాడినట్లు సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అవన్నీ అవాస్తవం. దయచేసి అబద్ధాలను ఎవరూ ప్రసారం చేయొద్దు.. పుకార్లను వార్తలుగా మల్చవద్దని మీడియాను నాగార్జున ట్విట్టర్ ద్వారా కోరారు.

కాగా.. ఓ ఇంటర్వ్యూలో సమంతా- నాగచైతన్య విడాకులపై నాగార్జున స్పందించినట్లుగా వార్తలు వచ్చాయి. దాని ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని ఆయన పేర్కొన్నారు అయితే నాలుగేళ్ల వివాహ‌ బంధంలో వాళ్లకు విడిపోయేటంత పెద్ద స‌మస్య ఎందుకొచ్చింది అనేది త‌న‌కు తెలియ‌ద‌ని నాగార్జున చెప్పారు. గతేడాది (2021) న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారని.. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్యా ఏదో సమస్య వచ్చిందని నాగ్ వివరించినట్లుగా ఆ కథనాల్లో వుంది.

సమంతనే తొలుత విడాకులు కావాలని కోరిందని, ఆమె కోరిక మేరకే చైతన్య అంగీకరించాడని నాగార్జున చెప్పారంటూ వస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. కాగా.. నాగ చైతన్య- సమంత విడాకుల ప్రకటన తర్వాత తమ కుటుంబంపై వచ్చిన వార్తలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.

More News

69 ఏళ్ల తర్వాత పుట్టింటికి ఎయిరిండియా.. టాటా గ్రూప్‌కు అప్పగించిన కేంద్రం

ఇప్పటి వరకు ప్రభుత్వరంగంలో సేవలందించిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా 69 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరుకుంది.

ఏపీలో కొత్త జిల్లాలు.. ఇకపై రాయలసీమకూ సముద్రతీరం, ఎలాగంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.

జగన్ పిలవగానే.. మోకాళ్లపై కూర్చొని మాట్లాడిన ఐఏఎస్ అధికారి, ఫోటో వైరల్

బ్యూరోక్రాట్లు ముఖ్యమంత్రులు, మంత్రుల వద్ద మితిమీరిన వినయం ప్రదర్శిస్తున్నారు.

రిపబ్లిక్ డే : వివాదంలో అనసూయ.. 'అరే ఏందిరా బై మీ లొల్లి..' అంటూ రెచ్చిపోయిన రంగమ్మత్త

స్టార్ యాంకర్, సినీ నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇందుకు కారణం ఏంటీ..?

‘సుందరాంగుడు’ చిత్రం విడుదలకు సహకరించండి - హీరో కృష్ణసాయి

ఏ.వి.సుబ్బారావు సమర్పణలో ఎమ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్‌ పతాకంపై కృష్ణసాయి,