ప్రేమమ్ అర్ధం ఏమిటో చెప్పిన నాగ్..!

  • IndiaGlitz, [Wednesday,September 21 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కించారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుంద‌ర్, రాజేష్ మురుగేష‌న్ సంగీతం అందించిన ప్రేమ‌మ్ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ ప్రేమ‌మ్ అంటే అర్ధం ఏమిటో చెప్పారు. ఇంత‌కీ నాగ్ ఏం చెప్పారంటే...మ‌న భాష‌ల‌న్నింటికి మూల‌మైన సంస్కృతంలో ప్రేమ‌మ్ అంటే ప్రేమ అని అర్ధం.
ఈ విష‌యాన్ని మొన్నే తెలుసుకున్నాను. ఇక ప్రేమ‌మ్ సినిమా గురించి చెప్పాలంటే...నాన్న‌గారికి దేవ‌దాసు, ప్రేమాభిషేకం, నాకు గీతాంజ‌లి చిత్రాలు ఎంత పేరు తీసుకువ‌చ్చాయో తెలిసిందే. ఆ చిత్రాల వ‌లే చైతుకు ప్రేమ‌మ్ చిత్రం మంచి పేరు తీసుకువ‌స్తుంది అని ఆశిస్తున్నాను అని తెలియ‌చేసారు.

More News

పవన్ కాటమరాయుడు షూటింగ్ ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు.ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెరకెక్కిస్తున్నారు.

సూర్య‌తో నీతూచంద్ర‌

గోదావ‌రి, స‌త్య‌మేవ జ‌య‌తే వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన నీతూ చంద్ర‌, త‌మిళం, క‌న్న‌డ స‌హా హిందీ చిత్రాల్లో కూడా న‌టించింది.

హీరోగా జ‌గ్గుభాయ్

హీరోగా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు...లెజెండ్ సినిమాతో విల‌న్ గా మారిన విష‌యం తెలిసిందే. లెజెండ్ సినిమాతో విల‌న్ గా కూడా ఆక‌ట్టుకుని ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో విల‌న్ గా ఫుల్ బిజీ అయ్యారు జ‌గ‌ప‌తి.

హైద‌రాబాద్‌కు అజిత్‌

తమిళ స్టార్ హీరోస్‌లో అజిత్ ఒక‌రు. తమిళంతో పాటు తెలుగు మార్కెట్ పై కూడా అజిత్ దృష్టి సారిస్తున్నాడు. అందుకే అజిత్ సినిమాల‌ను హైద‌రాబాద్ స‌హా తెలుగు రాష్ట్రాల్లో చిత్రీక‌ర‌ణ చేస్తుంటారు. వీరుడొక్క‌డే, వేదాళం సినిమాల‌ను కూడా ఇక్క‌డ చిత్రీకరించారు.

ఈరోజే ఈడు గోల్డ్ ఎహే గోల్డ్ టూర్ ప్రారంభం

డాన్సింగ్ స్టార్ సునీల్,బిందాస్,రగడ,దూసుకెళ్తా చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.