నాగ్ మూవీలో వరుణ్ తేజ్ హీరోయిన్..

  • IndiaGlitz, [Saturday,April 23 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌దుప‌రి చిత్రంలో వ‌రుణ్ తేజ్ హీరోయిన్ న‌టిస్తుంద‌ట‌. ఇంత‌కీ వ‌ర‌ణ్ తేజ్ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? క‌ంచె సినిమాలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించిన ప్ర‌గ్యా జైస్వాల్. కంచె సినిమాలో ప్ర‌గ్యా ప‌ర్ ఫార్మెన్స్ ద‌ర్శ‌కేంద్రుడికి బాగా న‌చ్చింద‌ట‌. అందుక‌నే నాగార్జున తో తెర‌కెక్కిస్తున్న భ‌క్తిర‌స చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ కి ద‌ర్శ‌కేంద్రుడు అవ‌కాశం ఇచ్చార‌ని స‌మాచారం.
ఈ చిత్రానికి న‌మో వెంక‌టేశాయ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం కోసం రెండు పాట‌ల‌ను ప్ర‌సాద్ ల్యాబ్స్ లో రికార్డ్ చేసారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రంలో ప్ర‌గ్యా కి అవ‌కాశం రావ‌డం నిజ‌మైతే క‌నుక ప్ర‌గ్యా మ‌రింత పాఫుల‌ర్ అవ్వ‌డం..మ‌రిన్ని అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం ఖాయం.