close
Choose your channels

ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో నాగ్ శిక్షణ.. 'రా' ఏజెంట్ గా బీభత్సమే!

Wednesday, June 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో నాగ్ శిక్షణ.. రా ఏజెంట్ గా బీభత్సమే!

ప్రయోగాలకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండే స్టార్ కింగ్ నాగార్జున. తన సినీ కెరీర్ లో నాగార్జున తన ఇమేజ్ నుంచి బయటకు వచ్చి అనేక చిత్రాలు చేశారు. ప్రస్తుతం నాగార్జున 'గరుడ వేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నారు. అబ్బురపరిచే యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది.

ఇదీ చదవండి: పాపనాశం 2: పాతికేళ్ల తర్వాత కమల్ తో.. గౌతమి ప్లేస్ లో ఆమె..

ప్రస్తుతం చిత్ర యూనిట్ రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రలో నటిస్తున్నారు. ఒక్కసారి ప్రవీణ్ సత్తారు గరుడ వేగ ని గుర్తు చేసుకుంటే ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ కోసం నాగార్జున కూడా శిక్షణ తీసుకుంటున్నారు.

తాజా సమాచారం మేరకు నాగార్జున క్రావ్ మాగా, సమురై స్వోర్డ్ లాంటి ఇజ్రాయెల్ యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. నాగార్జున నటించే యాక్షన్ సన్నివేశాలు ఇజ్రాయెల్ యుద్ధ విద్యలు కీలకం కానున్నాయట. దాదాపు కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న రా ఏజెంట్.. ఓ మిషన్ కోసం తిరిగి ఇండియాకు వచ్చే పాత్రలో నాగార్జున నటిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై లో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. నాగ్ చివరగా 'వైల్డ్ డాగ్' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్ ఎన్ ఐ ఏ అధికారిగా నటించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.