నాగార్జున మ‌రో కోణాన్ని ఎలివేట్ చేస్తున్న 'వైల్డ్ డాగ్‌'

  • IndiaGlitz, [Friday,March 12 2021]

అక్కినేని నాగార్జున అంటే రొమాంటిక్ సినిమాలే ఎక్కువ‌గా గుర్తుకు వ‌స్తాయి. మాస్ పాత్ర‌ల్లో నాగార్జున మెప్పించిన సినిమాలు త‌క్కువే. అయితే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నాగార్జున వైవిధ్య‌మైన సినిమాల్లో న‌టించ‌డానికి ఓకే చెబుతున్నాడు. అందులో భాగంగా నాగార్జున టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’. ఇందులో నాగార్జున విన‌య్ వ‌ర్మ అనే ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ అయిన నాగార్జున‌ని సినిమాలో అంద‌రూ ‘వైల్డ్ డాగ్‌’ అని పిలుస్తుంటారు. ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్‌2న విడుద‌ల‌వుతుంది. శుక్ర‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను చూస్తే గోకుల్ చాట్ స‌హా దేశంలో జ‌రిగిన కొన్ని టెర్ర‌ర్ దాడుల‌కు కార‌ణ‌మైన ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టు బెట్ట‌డానికి వైల్డ్‌డాగ్ అండ్ టీమ్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేసింది అనే క‌థాంశంతో సినిమా రూపొందిన‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

More News

పవన్‌కు పోటీగా నిధి అగర్వాల్ పాత్ర

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్‌గా రెండు సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నారు. ఇందులో ఓ సినిమా ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. మెఘల్ కాలపు నేపథ్యంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ మూవీ ఇది.

ఉబర్ డ్రైవర్ మాస్క్ పెట్టుకోమన్నందుకు రచ్చ రచ్చ చేసిన మహిళలు

కొందరి ప్రవర్తన ఎదుటి వారికి ఎంత ఇబ్బందికరంగా పరిణమిస్తుందో చెప్పేందుకు ఈ న్యూసే ఉదాహరణ. అసలే కరోనా సమయం.. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది.

పవన్ ‘హరిహర వీరమల్లు’ కంప్లీట్ స్టోరీ ఇదేనట..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో పిరియాడిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి వైరల్

'గాలిసంప‌త్' కి అద్వితీయ‌మైన రెస్పాన్స్ కు హ్యాపీగా ఉంది - రాజేంద్రప్ర‌సాద్‌

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ పాత్ర‌లో రూపొందిన‌ చిత్రం `గాలి సంప‌త్.

దుబాయ్ లో 3 పాట‌లు పూర్తి చేసుకున్న హిమాల‌య స్టూడియో మేన్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం

స్టార్ హీరోలు, భారీ బ‌డ్జెట్ చిత్రాలు త‌ప్ప మీడియం చిత్రాలు ఇటీవ‌ల కాలంలో విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అందులో క‌రోనా త‌ర్వాత విదేశాల‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు.