నాయిని సతీమణి మృతి.. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

  • IndiaGlitz, [Tuesday,October 27 2020]

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణించి ఐదు రోజులు కూడా గడవక ముందే ఆయన సతీమణి అహల్య(68) మరణించారు. కరోనా కారణంగా బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి నాయినితోపాటు, ఆయన సతీమణి అహల్య కూడా అక్కడే క్రిటికల్ కేర్ వార్డులో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలోనే నాయిని ఈ నెల 21న తుదిశ్వాస విడిచారు. కాగా.. ఈ నెల 22న భర్తను కడసారి చూసేందుకు అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ సపోర్టుతో, వీల్‌చైర్‌పై తీసుకొచ్చారు. అంత్యక్రియలు పూర్తైన వెంటనే తిరిగి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఐదు రోజుల వ్యవధిలోనే ఆమె కూడా సోమవారం తుదిశ్వాస విడిచారు. అహల్య మరణవార్త తెలియగానే బంధువులంతా ఆస్పత్రి వద్దకు చేరుకుని తీవ్ర ఆవేదన చెందారు.

ఐదు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి కుమారుడు దేవేందర్‌రెడ్డి, కుమార్తె సమతా రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా అహల్య అంత్యక్రియలను నేటి మధ్యాహ్నం గచ్చిబౌలిలోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. అహల్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

More News

సాయితేజ్ కొత్త సినిమా టైటిల్‌...?

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్.

ఆ సీన్‌ను తొలగించండి: ‘ఆర్ఆర్ఆర్’పై భీం మునిమనవడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.

విమర్శించిన నెటిజన్‌కి సోనూ దిమ్మతిరిగే రిప్లై..

కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సాయానికి ప్రజలు ఆయనను రియల్ హీరోగా తమ గుండెల్లో పెట్టుకున్నారు.

తివిక్రమ్ ఎన‌ర్జీ చూపించనున్నాడా..?

మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌డానికి హీరోలంద‌రూ ఆస‌క్తి చూపిస్తుంటారు.

నారా లోకేష్‌‌ను ప్రమాదం నుంచి కాపాడిన ఎమ్మెల్యే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నారు.