close
Choose your channels

విడుద‌ల‌కు సిద్ద‌మైన 'న‌ల్ల‌మ‌ల‌'

Friday, July 23, 2021 • తెలుగు Comments

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం `న‌ల్ల‌మ‌ల‌`.

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రవి చరణ్ ‌దర్శ‌కుడు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ ఇప్ప‌టికే 17 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం.

అలాగే ఈ చిత్రంనునుండి విడుద‌లైన అన్ని పాట‌లు 1మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించ‌డం ఆడియ‌న్స్‌లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌తేధిని ప్ర‌క‌టించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz