'నమస్తే నేస్తమా' జ‌న‌వ‌రి 3న విడుదల

  • IndiaGlitz, [Wednesday,January 01 2020]

యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్స్ సాధించాయి. ఒక డాగ్ ప్రధాన పాత్రలో జాకీ ష్రాఫ్ హీరోగా కె. సి బొకాడియా అందించిన 'తేరి మెహెర్బానియా' గోల్డెన్ జూబ్లీ హిట్ అయింది. ఆ చిత్రం ఇన్స్పిరేషన్ తో 'తేరి మెహెర్బానియా' పార్ట్ 2గా కె. సి బొకాడియా దర్శక నిర్మాతగా రూపొందిన 'నమస్తే నేస్తమా' జనవరి 3న గ్రాండ్ గా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలని దర్శక నిర్మాత కె. సి బొకాడియా తెలియజేస్తూ..

మా నాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద 'బి.ఎం.బి' ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసి బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్, స్టార్ హీరో హీరోయిన్స్ అందరితో సినిమాలు నిర్మించాను. 'నమస్తే నేస్తమా' విషయానికి వస్తే..రెండు కుక్క పిల్లలు చిన్నప్పుడే విడిపోయి ఒకటి పోలీసు దగ్గర, మరోటి దొంగ దగ్గర పెరుగుతాయి. శ్రీరామ్‌ పోలీస్‌ ఆఫీసర్ పాత్ర చేశారు. అతను హత్యకు గురవుతాడు. ఈ రెండు కుక్కపిల్లలు కలిసి బాస్‌ని చంపిన న‌లుగురి మీద ఎలా పగ తీర్చుకున్నాయి? ఆ క్రమంలో ఎలాంటి సాహసాలు చేశాయి? చివరికి రెండు కుక్కపిల్లలు ఎలా కలుసుకున్నాయి అనేది కథ. బ్రహ్మానందం పోలీస్ డాగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చే అధికారిగా కనిపిస్తారు. నాజర్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర మంచి పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమాలో రెండు కుక్కలు అద్భుతంగా పెర్ఫామ్ చేశాయి. రెండు కుక్కలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. అయినా దాదాపు 100 రోజులు షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. బాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి రెండు పాటలు కంపోజ్ చేశారు. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తాయి. అలాగే న్యూ టాలెంట్ చరణ్ అర్జున్ మరో రెండు పాటలకి సంగీతం చేశారు అవికూడా చాలా బాగా వచ్చాయి. నాకు చాలా ఇష్టమైన 'తేరి మెహర్భానియా' ఇన్స్పిరేషన్‌తో తీసిన ఈ మూవీ జనవరి 3న విడుదలవుతుంది. తప్పకుండా మీరందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను

శ్రీరామ్‌ (గెస్ట్ అప్పీరియన్స్), ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్‌, సంగీతం: బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌: బి. లెనిన్‌, ఫైట్స్‌: బి.జె శ్రీధర్‌, సమర్పణ: లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌, కో-ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌, ర‌చ‌న‌- దర్శకత్వం: కె.సి. బొకాడియా.

More News

న్యూ ఇయర్ వేడుకల్లో శ్రద్ధాకు చేదు అనుభవం!

న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు వేడుకలకు కొదవుండదు. డబ్బులు పోయినా సరే.. యూత్‌కు ఇవాళ వచ్చే కిక్కే వేరు..

‘కాంగ్రెస్‌ను తీసి పారేయలేం.. జగన్‌తో మంచి సంబంధాలున్నాయ్’

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసిపారేయలేమని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమకు మంచి సంబంధాలున్నాయని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.

`హిట్‌` ఫ‌స్ట్ గ్లింప్స్‌.. ఫిబ్ర‌వ‌రి 28న విడుద‌ల

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `ఫ‌ల‌క్‌నుమాదాస్` వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో

‘జగన్‌కు ఓటేశారు.. ఇప్పుడు నేను పోరాటం చేయాలా!?’

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.! అయితే ఆ రెండూ కనిపించకుండా బయటికి మాత్రం నవ్వుతూనే మాట్లాడారు.

2020లోకి వచ్చేశాం.. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి!

2019కి గుడ్ బై చెప్పేశాం.. కొత్త ఏడాది 2020లోకి అడుగు పెట్టేశాం.. అయితే జనవరి 1 అనేది 2020 ప్రారంభానికి గుర్తు ఉండటమే కాదు..