ఇప్పుడు నమితను చూస్తే షాక్ అవడం ఖాయం..

  • IndiaGlitz, [Monday,February 01 2021]

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో బొద్దుగుమ్మ అనగానే గుర్తొచ్చే పేరు నమిత. కానీ ఇప్పుడు అలా అనడానికి వీల్లేదు. హీరోయిన్‌‌గా నమిత మంచి పేరు సంపాదించుకుంది. ఇటు కోలీవుడ్‌, టాలీవుడ్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని బాగానే సంపాదించింది. తెలుగులో కంటే తమిళ్‌లో ఎక్కువ సినిమాలు చేయడమే కాకుండా స్టార్‌ హీరోల సరసన సైతం నటించింది. తమిళ రియాల్టీ షో బిగ్‌బాస్‌లో కూడా పాల్గొంది. తరువాత శరీర తీరులో బాగా మార్పు వచ్చింది. దీంతో సినిమా అవకాశాలు ఆమెకు తగ్గిపోయాయి. బిగ్‌బాస్ షో తర్వాత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు.

కొన్ని టీవీ కార్యక్రమాల్లో మాత్రమే నమిత పాల్గొంటూ వస్తోంది. ఆ తర్వాత తన ప్రియుడు వీరేంద్రను నమిత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత నమిత మరింత లావై పోయింది. అంతగా లావెక్కిన నమితను చూసిన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో నమిత ఓ కఠిన నిర్ణయం తీసుకుని, తన శరీర బరువును తగ్గించేందుకు జిమ్‌లో పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. అదే సమయంలో సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.

ఇందుకోసం ఎక్కువ సమయాన్ని జిమ్‌లోనే గడుపుతోంది. తాజాగా ఆమె తన కసరత్తులు చేసే ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు నమితను చూసిన వారు షాక్ అవుతున్నారు. నిజంగా తాము చూస్తున్నది నమితనా.. కాదా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతలా మారిపోయింది నమిత. చాలా స్లిమ్‌గా అయిపోయి.. సినిమాల్లోకి వచ్చిన స్టార్టింగ్ డేస్‌ని నమిత గుర్తు చేస్తోంది. నమిత వర్కవుట్స్ వీడియో వైరల్‌ కావడంతో నమిత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

More News

మదనపల్లె ఘటన: సోషల్ మీడియా ఖాతాల సెట్టింగ్స్ ఎవరు మార్చారు?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది.

'సితార ఎంటర్టైన్ మెంట్స్' 'నరుడి బ్రతుకు నటన' చిత్రం ప్రారంభం

ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు కథానాయికగా ‘నేహాశెట్టి‘  ఫిబ్రవరి 4 నుంచి 'నరుడి బ్రతుకు నటన'  చిత్రం రెగ్యులర్ షూటింగ్ 

‘ఎఫ్ ‌3’.. ఫ్యాన్సీ డీల్ పూర్తి

స్టార్స్ న‌టించే సినిమాల‌కు ఉండే క్రేజే వేరు. సినిమా సెట్స్‌పై ఉండ‌గానే బిజినెస్ పూర్త‌వుతుంది. ఇప్పుడు ఎఫ్ 3 విష‌యంలో అదే జ‌రిగింది.

'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) లోని 'హే హుడియా' పాట‌ను విడుద‌ల

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా శ్రీ రంజిత్ మూవీస్ ప‌తాకంపై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం 'ఎఫ్‌సీయూకే' (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌).

యంగ్ టైగర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి భారీ బ‌డ్జెట్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.