close
Choose your channels

Bhagavanth Kesari:భగవంత్ కేసరి  : ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది.. బాలయ్య మాస్ జాతర, టీజర్ చూశారా మరి

Saturday, June 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహం నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘‘భగవంత్ కేసరి’’. షైన్ స్క్రీన్స్‌ పతాకంపై హరీశ్ పెద్ది, సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ రోజు నటసింహం పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది చిత్ర యూనిట్. భగవంత్ కేసరి నుంచి టీజర్‌ను రిలీజ్ చేసింది. మరి అది ఎలా వుందో చూస్తే...

విలన్ అర్జున్ రాంపాల్ కారులో వస్తుండగా.. ‘'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఆ వెంటనే తన ఆయుధంతో విలన్ గ్యాంగ్‌ను ఉతికి ఆరేస్తాడు. చివరిలో ‘‘ ఈ పేరు శానా ఏండ్లు యాదుంటది’’ అని బాలయ్య చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. సీరియస్ లుక్‌తో పాటు గిటార్ పట్టుకుని పిల్లలతో బస్సులో సందడి చేయడాన్ని చూడవచ్చు. అయితే అనిల్ రావిపూడి మార్క్‌ కామెడీ ట్రాక్‌ ఎక్కడా టీజర్‌లో కనిపించలేదు. బహుశా ట్రైలర్ నాటికి ఆ లోటును భర్తీ చేస్తారేమో చూడాలి. అలాగే హీరోయిన్లు కాజల్, శ్రీలీలను కూడా ఎక్కడా చూపించలేదు. కానీ ఈ టీజర్ మాత్రం బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్సే. బాలకృష్ణ సినిమా అనగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయే థమన్.. ఎప్పటిలాగే తన మార్క్ బీజీఎంను అందించాడు.

భగవంత్ కేసరిలో బాలయ్యకు జోడీగా తొలిసారిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అలాగే మరో హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కూతురిగా కనిపించనున్నారు. ఇక భగవంత్ కేసరి ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ దాదాపు రూ.36 కోట్లకు రైట్స్ దక్కించుకున్నట్లుగా సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.