ఒకే ర‌హ‌దారి.. నంద‌మూరి హ‌రికృష్ణ‌ ఫ్యామిలీ

  • IndiaGlitz, [Wednesday,August 29 2018]

కొన్ని ఘ‌ట‌న‌లు యాదృచ్చికంగా జ‌రిగినా.. అనుకోని లింక్ ఏదో క‌న‌ప‌డుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌యం కాకున్నా.. ప్ర‌స్తావించుకోవాల్సి వ‌స్తుంది. విష‌య‌మేమంటే నేడు ఉద‌యం నల్గొండ జిల్లా అన్నేప‌ర్తిలో జ‌రిగిన కారు ప్ర‌మాదంలో టీడీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ చ‌నిపోయారు. నంద‌మూరి అభిమాని కొడుకు పెళ్లికి వెళ్తున్న త‌రుణంలో ప‌క్క‌నున్న కారును ఓవ‌ర్ టేక్ చేయబోయి కారు ప్ర‌మాదానికి గురైంది.

ఆ ప్ర‌మాదంలో హ‌రికృష్ణ త‌ల‌, చాతికి బ‌ల‌మైన గాయ‌లైయాయి. ఈ ప్రమాదంలో ఆయ‌న క‌న్నుమూశారు. విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవేలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఈ విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవే.. నంద‌మూరి ఫ్యామిలీకి జ‌రిగిన ప్ర‌మాదాల‌కు ఏదో ర‌కంగా లింక్ ఉంటూనే ఉంది. 2009లో జూనియ‌ర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ప్రచారానికి వెళ్లి హైద‌రాబాద్ వ‌స్తున్న క్ర‌మంలో సూర్య పేట ద‌గ్గ‌ర‌లోని మొటే గ్రామం వ‌ద్ద పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగింది. అదృష్ట‌వ‌శాతు ఎన్టీఆర్ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. దాదాపు మూడు నెల‌లు పాటు ఆయ‌న బెడ్‌పైనే ఉండాల్సి వ‌చ్చింది.

ఇదే విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవేపై 2014లో న‌ల్గొండ జిల్లా ఆకుల‌ప‌ర్తి గ్రామం వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ పెద్ద త‌న‌యుడు నంద‌మూరి జాన‌కిరాం క‌న్నుమూశారు. ఇలా నంద‌మూరి ఫ్యామిలీలో..ముఖ్యంగా నంద‌మూరి హ‌రికృష్ణ ఫ్యామిలీలో ముగ్గురు వ్య‌క్తులు.. విజ‌య‌వాడ ర‌హ‌దారిలో న‌ల్గొండ స‌మీపంలో కారు ప్ర‌మాదాల‌కు గుర‌య్యారు. అందులో ఎన్టీఆర్ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా.. జాన‌కిరామ్ ఇప్పుడు హ‌రికృష్ణ ప్ర‌మాదంలో క‌న్నుమూశారు.

More News

నంద‌మూరి హ‌రికృష్ణ దుర్మ‌ర‌ణం

న‌టుడు, నిర్మాత, టీడీపీ నేత‌ నంద‌మూరి హ‌రికృష్ణ న‌ల్గొండ జిల్లా అన్నేప‌ర్తిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు.

స‌ముద్రంలో సాహ‌సాలు...

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్స్‌గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  ఓ సినిమా నిర్మిత‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

వారాహిలో నిఖిల్ చిత్రం?

వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై త్వ‌ర‌లోనే నిఖిల్ హీరోగాఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది.

త‌మిళంలో ఎన్టీఆర్ చిత్రం..?

తెలుగు సినిమా కాన్సెప్ట్స్  ఇప్పుడు యూనివ‌ర్సల్ కాన్సెప్ట్‌ల‌య్యాయి. దాంతో ఇత‌ర భాషా ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌న సినిమాల‌ను రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.

ఊటీ లో షూటింగ్ జరుపుకుంటున్న 'లాస్ట్ సీన్'

హర్ష కుమార్, తులిక సింగ్ హీరో హీరోయిన్లు గా మధునారాయణ్ ముఖ్య పాత్రలో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏ.జి ఎంటర్టైన్మెంట్   బ్యానర్స్ లో