దిల్‌రాజు ఫంక్షన్‌కి నంద‌మూరి హీరోలు ..రాలేదు ఎందుకు?

  • IndiaGlitz, [Friday,December 18 2020]

తెలుగు టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు పుట్టినరోజు శుక్రవారం(డిసెంబర్ 18). ఈ ఏడాది తేజ‌స్విని పెళ్లి చేసుకుని మ‌ళ్లీ లైఫ్‌ను కొత్త‌గా స్టార్ట్ చేశాడు దిల్‌రాజు. ఈ సంద‌ర్భంలో మీడియా ప్ర‌తినిధులకు, ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌కు భారీ రేంజ్‌లో పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ వేడుక‌కి మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌భాస్‌, మ‌హేశ్‌, రామ్‌చ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రామ్‌, నాగ‌చైత‌న్య‌, అఖిల్‌, నితిన్‌, విశ్వ‌క్‌సేన్ స‌హా హీరోయిన్స్‌లో స‌మంత‌, పూజా హెగ్డే, రాశీఖ‌న్నా, నివేదా పేతురాజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వంటి వారు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు అస్స‌లు క‌న‌ప‌డ‌లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ‌కు, దిల్‌రాజు ర్యాపో లేద‌నే అనుకుందా.. మ‌రి మిగిలిన నంద‌మూరి హీరోల‌తో మంచి రిలేష‌నే ఉంది క‌దా. ఎన్టీఆర్‌తో బృందావ‌నం, రామ‌య్యావస్తావ‌య్యా వంటి సినిమాలు చేసిన దిల్‌రాజు, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ చేసిన ప‌టాస్‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అలాంట‌ప్పుడు నంద‌మూరి హీరోల సంద‌డి దిల్‌రాజు ఫంక్ష‌న్‌లో క‌న‌ప‌డ‌లేదు ఎందుకో అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌కు ఇటు దిల్‌రాజు, అటు నంద‌మూరి హీరోలు ఏమైనా ఫుల్‌స్టాప్ పెడ‌తారేమో చూడాలి.

More News

కష్టం వస్తే చెప్పండి ఆదుకుంటా: దిల్ రాజు

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను సినీ ఇండస్ట్రీ పక్కాగా ఫాలో అవుతూ ఉంటుంది.

బిగ్‌బాస్ షో పై త‌మిళ‌నాడు సీఎం సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

సినిమా స్టార్స్‌కి, రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌ధ్య మంచి అనుబంధం ఉంటుంది.

వినోదాల విందుగా 'వివాహ భోజనంబు' టీజర్

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక. నిర్మాణ సంస్థలు  ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ,

ఈ నెల 24 న వస్తున్న రాంగోపాల్ వర్మ ఫిల్మ్ 'మర్డర్'

అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ,నట్టి క్రాంతి లు నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్..

కొత్త సంవత్సరంలో విడుదల కాబోతున్న 'బోగ‌న్'

స్టైలిష్ యాక్ట‌ర్ అర‌వింద్ స్వామి, స‌క్సెస్ ఫుల్ హీరో జ‌యం ర‌వి, బ‌బ్లీ బ్యూటీ హన్సిక కాంబినేష‌న్ లో