నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ '118' టీజ‌ర్ విడుద‌ల 

  • IndiaGlitz, [Tuesday,December 18 2018]

డైన‌మిక్ హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ '118'. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా టీజ‌ర్ నేడు విడుద‌లైంది.

హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో సినిమాను తెర‌కెక్కించారు. పాత్రానుగుణంగా నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్‌తో క‌నిపించారు. ఏదో తెలియ‌ని విష‌యం ఆయ‌న్ని వెంటాడుతున్న‌ట్లు, ఆ విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్న‌ట్లు క‌ల్యాణ్ రామ్ పాత్ర‌ను ద‌ర్శ‌కుడు కె.వి.గుహ‌న్ మ‌లిచిన తీరు ఆస‌క్తిక‌రంగా ఉంది. టోట‌ల్‌గా సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా సినిమా అంద‌రినీ మెప్పించ‌నుంద‌ని టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

టీజ‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా .....చిత్ర నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ - నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌గారి 118 టైటిల్ లోగో, ఫ‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌లే విడుద‌ల చేశాం. ఇప్పుడు టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ల్యాణ్ రామ్‌గారి పాత్ర లుక్ ఎలా ఉంటుంద‌నే విష‌యంతో పాటు అస‌లు సినిమా ఏ జోన‌ర్‌లో తెర‌కెక్కింద‌నే విష‌యాన్ని టీజ‌ర్ ద్వారా చూపించాం. సీట్ ఎడ్జింట్ థ్రిల్ల‌ర్ ఇది. క‌ల్యాణ్ రామ్‌గారు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి జోన‌ర్. వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీష్ అద్భుతమైన యాక్ష‌న్ పార్ట్ సినిమాలో చాలా కీల‌కంగా ఉంటుంది.

నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కులు కె.వి.గుహ‌న్‌గారు ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచయం అవుతున్నారు. ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఆయ‌న క‌థ‌, క‌థ‌నం, సినిమాటోగ్ర‌ఫీ చేశారు. శేఖర్ చంద్ర సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్నారు.

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లు: మిర్చి కిర‌ణ్‌, పి.ఆర్ అండ్ మార్కెటింగ్‌: వ‌ంశీ కాక‌, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్‌: వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌, వి.ఎఫ్.ఎక్స్‌: అద్వైత క్రియేటివ్ వ‌ర్క్స్‌, అనిల్ ప‌డూరి, నిర్మాత‌: మ‌హేశ్ కొనేరు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌.

More News

ఆస్కార్ బ‌రిలో ఈసారి కూడా లేదు...

ఆస్కార్స్ 2018 బ‌రిలోని ఉత్త‌మ విదేశీ చిత్రంగా మ‌న‌దేశం త‌ర‌పున 'విలేజ్ రాక్‌స్టార్స్‌' ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఇది అస్సామీ చిత్రం.

బాబాయ్ స్పీచ్‌కి అబ్బాయ్ ఫిదా

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ అధినేత రాజ‌కీయ ప్ర‌చారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న అమెరికాలో బిజీ బిజీగా ఉన్నాడు.

'ముద్ర' వాయిదా ప‌డ‌నుందా?

నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ముద్ర‌'. వాస్త‌విక ఘ‌ట‌న‌ల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా ఇది.

వైవిధ్య‌మైన పాత్ర‌లో పాయల్ 

తొలి చిత్రం 'ఆర్.ఎక్స్ 100'లో లిప్‌లాక్‌ల‌తో రెచ్చిపోయిన పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిగా కూడా మంచి ప్ర‌శంస‌లే అందుకుంది. అయితే వెంట వెంట‌నే సినిమాలు ఒప్పుకోకుండా అచి తూచి సినిమాల‌ను ఎంచుకుంటుంది.

ప్ర‌భాస్ గెస్ట్ హౌస్ సీజ్‌

రాయ‌దుర్గం ప‌రిధిలోని శేరిలింగం ప‌ల్లిలో స‌ర్వే నెం 46లో 84 ఏక‌రాల ప్ర‌భుత్వ భూమిని కొంత మంది ప్రైవేటు వ్య‌క్తులు ఆక్ర‌మించుకున్నారు. దీనిపై త‌హ‌సీల్దారు చ‌ర్య‌లు చేప‌డితే