close
Choose your channels

నాని 27.. ‘శ్యామ్ సింగ‌రాయ్’ షూటింగ్ షురూ

Monday, December 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాని 27.. ‘శ్యామ్ సింగ‌రాయ్’ షూటింగ్ షురూ

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన నాని, ఏ మాత్రం ఆల‌స్యం చేయకుండా త‌న త‌దుప‌రి సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్‌ను షురూ చేశాడు. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అల‌లాగే ఈ సినిమాలో నానిలో మూడు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడని.. సినిమాలో రెండు ప్రేమ‌క‌థ‌లుంటాయి. నాని స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారని న్యూస్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్పటి వరకు సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా న‌టించ‌డానికి ఓకే అనేశారు. మరో హీరోయిన్‌ను కూడా ఎంపిక చేసుకోబోతున్నారట. త్వరలోనే అదెవరనేది తెలుస్తుంది.

‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలో రెండు ప్రేమకథలుంటాయి. ఓ ప్రేమ‌క‌థ హైద‌రాబాద్‌లో, మ‌రో ప్రేమ‌క‌థ కోల్‌క‌తా బ్యాక్‌డ్రాప్‌లో ర‌న్ అవుతుంది. కోల్‌క‌త్తాలో జరిగే పార్ట్ ప్లాష్ బ్యాక్ ఉంటుందట. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 26 సినిమాలు చేసిన నాని, త‌న కెరీర్‌లో తొలిసారి పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సినిమా చేయ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.